Site icon NTV Telugu

Bengaluru: భార్య మెడపై కాలుతో తొక్కి చంపిన భర్త..

Bengalore

Bengalore

Bengaluru: బెంగళూర్‌లో దారుణం చోటు చేసుకుంది. భార్యభర్తల మధ్య గొడవ భార్య హత్యకు దారి తీసింది. ఇద్దరి మధ్య వాగ్వాదం కారణంగా కోపంతో భర్త భార్యను హత్య చేశాడు. భార్యను నేలపై పడేసి, గొంతుపై కాలితో చనిపోయే వరకు తొక్కుతూ చంపాడు. మృతురాలికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

READ ALSO: Kinjarapu Atchannaidu: జగన్ సమాజానికి ఏం మెసేజ్‌ ఇస్తున్నారు?.. అచ్చెన్నాయుడు ఫైర్!

నిందితుడిని హరీష్ కుమార్‌గా గుర్తించారు. హరీష్ కుమార్, పద్మజలు కర్ణాటకలోని శ్రీనివాస్‌పూర్‌కు చెందిన వారు. వీరిద్దరు ఇంజనీరింగ్ పూర్తి చేసి, బెంగళూర్‌లో ఉద్యోగం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరు పిల్లలు ఉన్న ఈ జంట తరుచూ గొడవపడేవారని, మంగళవారం రాత్రి ఇది మరింత తీవ్రంగా మారినట్లు పోలీసులు చెప్పారు.

READ ALSO: Arunachal CM: చైనాకు షాక్ ఇచ్చిన అరుణాచల్ సీఎం.. ఏమన్నారంటే..

హరీష్ పద్మజను కొట్టి, ఆమెను నేలపై పడేసి, ఆమె మెడపై కాలితో తొక్కుతూ చంపేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనప బొమ్మనహళ్లీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. హరీష్‌ని అరెస్ట్ చేసి, ప్రశ్నిస్తున్నారు.

Exit mobile version