Site icon NTV Telugu

Bengaluru Crime: మహిళ, ఆమె సోదరుడి హత్య.. ప్రేయసి కుమారుడే నిందితుడు..

Bengaluru

Bengaluru

Bengaluru Crime: వివాహేతర సంబంధాలు హత్యలు, ఆత్మహత్యలకు కారణమవుతున్నాయి. బెంగళూర్‌లో ఒక మైనర్ బాలుడు మహిళ, ఆమె సోదరుడిని హత్య చేసిన ఘటన సంచలనంగా మారింది. పీన్యా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. మృతులను మల్లే గౌడ భార్య యమున(36) ఆమె సోదరుడు సుదీప్(34)గా గుర్తించారు. నిందితుడు 16 ఏళ్ల బాలుడని తేలింది. ఇతను ఛాయా అనే మహిళ కుమారుడని సమాచారం.

Read Also: PM Modi: మోడీ కాన్ఫరెన్స్‌కు పలువురు సీఎంలు దూరం.. కారణమిదే!

ప్రాథమిక దర్యాప్తులో.. యమున భర్త మల్లే గౌడకు ఛాయాతో వివాహేతర సంబంధం ఉంది. భర్త సంబంధం గురించి తెలుసుకున్న భార్య యమున, బావమరిది సుదీప్ ఛాయాను నిలదీయడానికి ఆమె ఇంటికి వెళ్లారు. ఈ సమయంలోనే ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఘర్షణ తీవ్రం కావడంతో ఛాయా కుమారుడు కత్తితో సుదీప్, యమునలపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. గాయాలపాలైన ఇద్దరు మరణించారు. ఈ కేసును పోలీసులు సుమేటోగా స్వీకరించి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసుపై పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు.

Exit mobile version