Basara IIIT Student S*uicide: బాసర ట్రిపుల్ విద్యార్థి ఆత్మ*హత్యకు అసలు కారణం ఇదే.. కీలక విషయాలు వెల్లడి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Basara IIIT Student Suicide: బాసర ట్రిపుల్ ఐటీలో ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్న చల్లా సంపత్ ఆత్మహత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ కారణంగానే సంపత్ ప్రాణాలు తీసుకున్నాడంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని నిర్మల్ జిల్లా ఎస్పీ జానకీ షర్మిళ స్పష్టం చేశారు. ఈ ఘటనకు బెట్టింగ్ యాప్స్‌తో పాటు తోటి విద్యార్థులకు కూడా ఎలాంటి సంబంధం లేదని వెల్లడించారు.
సంపత్ ఆత్మహత్యకు ప్రధాన కారణం సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోవడమేనని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. తన తల్లికి బంగారం కొనివ్వాలనే కోరికతో సంపత్ ఓ నకిలీ పెట్టుబడి పథకాన్ని నమ్మాడు. తక్కువ సమయంలోనే ఎక్కువ లాభాలు వస్తాయని సైబర్ నేరగాళ్లు అతడిని మభ్యపెట్టారు. టెలిగ్రామ్ యాప్ ద్వారా ఓ జ్యువెలరీ షాపు ఇన్వెస్ట్మెంట్ స్కీంలో డబ్బులు పెట్టుబడిగా పెట్టించారు.
Also Read
- Delhi Gang Rape Case: ఢిల్లీలో యువతిపై సామూహిక అత్యాచారం.. ఇద్దరు మహిళలతో సహా ముగ్గురు అరెస్టు
- Tragedy: స్కూల్ బస్సును ఢీకొన్న లారీ.. నలుగురు చిన్నారులు మృతి, 35 మందికి గాయాలు!
- Madhya Pradesh: ఆస్తి కోసం అమానుషం.. 80 ఏళ్ల తండ్రిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన కొడుకు!
- Man Rescued: డ్రైనేజీలో చిక్కుకున్న వ్యక్తి.. నాలుగు రోజుల తర్వాత సురక్షితంగా బయటకు..
అయితే, సంపత్ డబ్బులు జమ చేసిన వెంటనే ఆ యాప్ మాయమైంది. దీంతో తాను మోసపోయానని గుర్తించిన విద్యార్థి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. పెట్టుబడిగా పెట్టిన డబ్బులు తిరిగి రావనే ఆందోళనతో హాస్టల్ గదిలో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
ఈ కేసుపై నిర్మల్ జిల్లా ఎస్పీ జానకీ షర్మిళ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఇది పూర్తిగా సైబర్ నేరానికి సంబంధించిన ఘటనగా గుర్తించామని, నిందితులను పట్టుకునేందుకు సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు ముమ్మరం చేసినట్లు తెలిపారు. తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు వస్తాయనే ఆశతో గుర్తుతెలియని వ్యక్తులు పంపే లింకులు, నకిలీ పెట్టుబడి పథకాలను నమ్మి విద్యార్థులు, యువత మోసపోవద్దని పోలీసులు హెచ్చరించారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: 50 బంతుల్లో డబుల్ సెంచరీ చేయొద్దు ప్లీజ్.. న్యూజిలాండ్ కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
CM Revanth Reddy: పౌల్ట్రీ రైతులకు సీఎం రేవంత్ గుడ్‌న్యూస్.. 48 గంటల్లో కీలక నిర్ణయం!
-
Basara IIIT Student S*uicide: బాసర ట్రిపుల్ విద్యార్థి ఆత్మ*హత్యకు అసలు కారణం ఇదే.. కీలక విషయాలు వెల్లడి..!
-
Ramayana Record: రామాయణ వరల్డ్ రికార్డు.. బాహుబలి 2 రికార్డు బ్రేక్.. నెక్స్ట్ టార్గెట్..?
-
Chiranjeevi: ‘కాకా’ కూడా హిట్ పడితే ఇక చిరునే టాప్?
ట్రెండింగ్
-
Life Lessons : అమ్మమ్మ ఇచ్చిన తాళంచెవి.. తరాలకు అందించిన నమ్మకం.!
-
Masala Paneer Paratha Recipe: బ్రేక్‌ఫాస్ట్ అయినా, లంచ్ బాక్స్ అయినా.. నోరూరించే ‘మసాలా పన్నీర్ పరాటా’ ఇలా చేసుకోండి..!
-
Fridge Cleaning Tips : ఫ్రిజ్ హ్యాండిల్ జిగటగా మారుతోందా?.. ఖరీదైన క్లీనర్లు లేకుండానే ఇలా సులభంగా శుభ్రం చేయండి
-
Kitchen Tips : సగం కోసిన ఉల్లిపాయను ఫ్రిజ్‌లో పెడుతున్నారా?.. ఈ తప్పు చేయొద్దు.!
-
Vaibhav Sooryavanshi: ఆయనతో మాట్లాడిన తర్వాతే ఈ విధ్వంసం సాధ్యమైంది.. 204 పరుగుల సీక్రెట్ బయటపెట్టిన వైభవ్!