Bareilly Viral Video: బురఖాలో ప్రియుడితో పట్టుబడిన భార్య.. నడిరోడ్డుపై భర్త వీరంగం..

  • బురఖాలో ప్రియుడితో పట్టుబడిన భార్య..
  • నడిరోడ్డుపైనే ఇద్దరిపై దాడి చేసిన భర్త..
  • వైరల్ అవుతున్న యూపీ వీడియో..
Viral Video

Viral Video

Bareilly Viral Video: ఉత్తర్ ప్రదేశ్‌లో భార్య బురఖా ధరించి ప్రియుడితో తిరుగున్న సమయంలో భర్తకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడింది. నడిరోడ్డుపైనే భర్త తన భార్య, యువకుడిపై దాడి చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన బరేలీలో చోటుచేసుకుంది. చాలా కాలంగా భార్యను అనుమానిస్తున్న భర్త, ఆమెపై నిఘా పెట్టాడు. ఆమెకు తెలియకుండా ఫాలో అవ్వడంతో ప్రియుడితో తిరుగుతున్న విషయం వెలుగులోకి వచ్చింది.

కారులో భార్య,ఆమె ప్రియుడిని చూసి వెంబడించాడు. వెంటనే వారిని నడిరోడ్డుపై ఆపేసి దాడి చేశాడు. అయితే, ఈ ఘటనపై అధికారికంగా ఫిర్యాదు అందకపోయినప్పటికీ, పోలీసులు సుమోటోగా కేసును స్వీకరించి దర్యాప్తు చేస్తున్నారు. భర్తకు చాలా రోజులుగా భార్యపై అనుమానం ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె సీక్రెట్‌గా ఎవరితోనో మాట్లాడుతున్నట్లు భర్త గమనించాడు. ఆ తర్వాత వీరిద్దరు కారులో కనిపించడంతో ఆగ్రహంతో ఉన్న అతను తన భార్యతో పాటు యువకుడితో నడిరోడ్డుపై వాగ్వాదానికి దిగాడు. చుట్టుపక్కల చేరిన జనాలు ఈ మొత్తం వ్యవహారాన్ని మొబైల్ ఫోన్లలో బంధించారు.