షేక్ పేట లో బ్యాంక్ ఉద్యోగి ఆత్మహత్య కలకలం రేపుతోంది. భార్య వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు సంతోష్. పాతబస్తీకి చెందిన కళ్యాణి తో మతాంతర ప్రేమ వివాహం చేసుకున్నాడు సంతోష్. ఆరేళ్ల కుమారుడిని తన దగ్గరికి పంపించకుండా భార్య వేధిస్తోందని సంతోష్ ఆరోపించాడు. ఆన్ లైన్ లో పురుగులమందు ఆర్డర్ తెప్పించుకున్న సంతోష్..చనిపోయే ముందు తల్లిదండ్రులకు సెల్ఫీ వీడియో పంపించాడు సంతోష్.
భార్య, కుటుంబ సభ్యుల వేధింపుల వల్ల చనిపోతున్నట్లు సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు సంతోష్. సంతోష్ ఆత్మహత్య పై కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు గోల్కొండ పోలీసులు.