Site icon NTV Telugu

SI Suicide: హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఎస్సై ఆత్మహత్య.. రైల్వేట్రాక్‌పై చెల్లాచెదురుగా శరీర భాగాలు

Traffic Si Suicide

Traffic Si Suicide

SI Suicide: హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ట్రాఫిక్ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న రమణ ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపుతోంది. మౌలాలిలో రైల్వేట్రాక్‌పై రమణ ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం ఉదయం రైల్వే ట్రాక్ వెంట నడుస్తూ వెళ్లిన స్థానికులు చెల్లాచెదురుగా పడి ఉన్న ట్రాఫిక్ ఎస్సై రమణ శరీరభాగాలను చూసి ఉలిక్కిపడ్డారు. వెంటనే ఈ విషయం గురించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టి మృతుడు ట్రాఫిక్ ఎస్సై రమణగా గుర్తించారు.

Read Also: Petrol Diesel Price: రెండేళ్లలో చమురు ధరలు తగ్గుతాయ్ : ప్రపంచ బ్యాంక్

కాగా 2020లో ఎస్సై ఉద్యోగానికి రమణ ఎంపికయ్యాడు. ప్రస్తుతం బంజారాహిల్స్ పరిధిలో ట్రాఫిక్ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నాడు. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస ప్రాంతానికి చెందిన నిరుపేద కుటుంబంలో రమణ జన్మించాడు. ఇప్పటివరకు అతడికి పెళ్లి కాలేదు. అయితే ఉన్నపళంగా రమణ ఆత్మహత్య చేసుకోవడంతో పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అతడి ఆత్మహత్యకు ప్రేమ వైఫల్యమే కారణమని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా ఇదే కోణంలో విచారణ చేపట్టారు.

Exit mobile version