Site icon NTV Telugu

Online Fruad: ఆన్‌లైన్‌లో స్మార్ట్‌‌ఫోన్‌ బుక్ చేస్తే.. ఏం వచ్చిందో తెలుసా..

Untitled Design (5)

Untitled Design (5)

ఈ మధ్య చాలామంది ఆన్‌లైన్ లో షాపింగ్ చేస్తున్నారు. దీంతో ఆన్ లైన్ ఫ్లాట్ ఫామ్స్ రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఆన్ లైన్ లో మోసాలు కూడా గణనీయంగా పెరిగిపోతున్నాయి. ఆర్డర్ చేసిన వస్తువుకు మరొక వస్తువు రావడంతో కస్టమర్స్ కంగుతింటున్నారు. ఇలాంటి సంఘటనలు రోజు జరుగుతూనే ఉన్నాయి. అయితే బెంగుళూరు ఇలాంటి తరహా ఆన్ మోసం ఒకటి చోటుచేసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Read Also: IIron-Rich Foods: ఐరన్ లోపంతో బాధపడుతున్నారా.. ఈ ఫుడ్స్ మీ మెనూలో చేర్చుకోండి

బెంగళూరుకు చెందిన ఓ సాప్ట్ వేర్ ఉద్యోగి ఆన్ లైన్ షాపింగ్ ప్లాట్ ఫామ్ అమెజాన్ లో 1.87 లక్షల విలువైన స్మార్ట్ ఫోన్ ఆర్డర్ పెట్టాడు. ఆర్డర్ ఇంటికి రావడంతో.. ఎంతో అతృతగా అతడు దాన్ని ఓపెన్ చేసి చూసి.. దీంతో అతడు ఒక్కసారిగా షాకయ్యాడు.. అతడు ఆర్డర్ పెట్టిన శామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌కు బదులుగా టైల్ ముక్కను అందుకున్నాడు.

Read Also: Fake Notes: దేశంలో చెలామణి అవుతున్న నకిలీ కరెన్సీ రూ. 500 నోటు

పూర్తి వివరాల్లోకి వెళితే.. ప్రేమానంద్ అనే వ్యక్తి అక్టోబర్ 14న అమెజాన్ యాప్ ద్వారా స్మార్ట్‌ఫోన్ కోసం ఆర్డర్ చేసి, తన క్రెడిట్ కార్డ్ ద్వారా పూర్తి మొత్తాన్ని చెల్లించాడు. అక్టోబర్ 19న డెలివరీ చేయబడిన సీల్డ్ ప్యాకేజీని అన్‌బాక్స్ చేస్తున్న వీడియోను అతను రికార్డ్ చేశాడు . స్మార్ట్‌ఫోన్‌కు బదులుగా టైల్ రావడంతో కంగుతిన్నారు.. “తాను రూ. 1.87 లక్షల విలువైన Samsung Galaxy Z Fold 7ని ఆర్డర్ చేశాను, కానీ తనకు షాక్ ఇచ్చేలా, దీపావళికి ఒక రోజు ముందు ఫోన్‌కు బదులుగా పాలరాయి రాయి వచ్చింది. ఈ సంఘటన మనం ఏడాది పొడవునా జరుపుకోవడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్న పండుగ స్ఫూర్తిని పూర్తిగా నాశనం చేసిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ముఖ్యంగా ఆన్ లైన్ లో షాపింగ్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రేమానంద్ సూచించాడు.

Read Also:Harassment: యువతితో అసభ్యంగా ప్రవర్తించిన కానిస్టేబుల్.. గళ్లపట్టి పీఎస్ కు లాక్కెళ్లిన మహిళ

అనంతరం ఈ విషయంపై నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (NCRP)లో ఫిర్యాదు చేశాడు. తరువాత అధికారిక ఫిర్యాదు నమోదు చేయడానికి కుమారస్వామి లేఅవుట్ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాడు. పోలీసులు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Exit mobile version