పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ రక్తసిక్తంగా మారింది. బలూచిస్తాన్‌లోని పాక్ ఆర్మీ మేజర్ కార్యాలయంపై బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దాడులు చేసింది. ఈ ఆత్మాహుతి దాడిలో 100 మంది పాక్ సైనికులు మరణించారు. మిలటరీ బేస్‌ను లక్ష్యంగా చేసుకొని పంజూర్, నోష్కీ పోస్టులపై ఆత్మాహుతి దాడులు జరిగాయి. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ త్వరలోనే చైనా పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటనకు ముందు దాడి జరగడంతో పాక్‌లో ఉద్రిక్తకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. అయితే, దాడిలో కేవలం 11 మంది మాత్రమే చనిపోయినట్టు పాక్ హోంశాఖ ప్రకటించింది. అయితే, బీఎల్ఏ దీనిని ఖండించింది. పాక్ హోంశాఖ అబద్దాలు చెబుతున్నదని స్పష్టం చేసింది.
Read: ఆ దేశంలో విచిత్రమైన శిక్షణ: సైనికులుగా మారాలంటే…
పాక్ నుంచి బలూచిస్తాన్‌ను వేరు చేయాలని, తమకు స్వతంత్య్రం కావాలని చాలా కాలంగా బలూచిస్తాన్ ప్రజలు ఉద్యమిస్తున్నారు. బలూచిస్తాన్‌లో ఇలాంటి ఘర్షణలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. అయితే, ఈ స్థాయిలో బీఎల్ఏ తెగబడలేదని పాక్ అధికారులు చెబుతున్నారు. దీనికి బదులు తీర్చుకుంటామని ఆర్మీ అధికారులు చెబుతున్నారు. శక్తివంతమైన ఆత్మాహుతి దాడులు జరగడంతో మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం.