NTV Telugu Site icon

Ayodhya gangrape: బాధితురాలికి అబార్షన్.. డీఎన్‌ఏ టెస్టు కోసం పిండం తరలింపు

Ayodhyagangrape

Ayodhyagangrape

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో 12 ఏళ్ల బాలికపై రెండు నెలల క్రితం కామాంధులు సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. బాధితురాలు గర్భం దాల్చడంతో ఆలస్యంగా ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో యోగి ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. గత శుక్రవారం బాధిత కుటుంబాన్ని కలుసుకుని వివరాలు తెలుసుకున్నారు. అనంతరం నిందితుల ఆస్తులను బుల్డోజర్లతో ధ్వంసం చేశారు. ఇదిలా ఉంటే నిందితుడు సమాజ్‌వాదీ పార్టీకి చెందిన వ్యక్తి అని అసెంబ్లీలో సీఎం యోగి ప్రకటన చేశారు. దీంతో సమాజ్‌వాదీ పార్టీ నేతలు.. నిందితులకు డీఎన్‌ఏ టెస్టులు చేసి నిజాలు వెలుగులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. జూలై 30న నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇది కూడా చదవండి: Bangladesh Violence: షేక్ హసీనా పార్టీ నేతలు, హిందువులే టార్గెట్.. 29 మంది నేతల హత్య..

బుధవారం బాధితురాలికి లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీలోని క్వీన్ మేరీస్ ఆస్పత్రి వైద్యులు అబార్షన్ చేశారు. 12 వారాల గర్భాన్ని తొలగించారు. ఎస్పీ నేతలు నిందితులకు డీఎన్ఏ టెస్టులు చేయాలని డిమాండ్ చేయడంతో పిండాన్ని టెస్టుల కోసం పోలీసులు తరలించారు. ఈ రిపోర్టే పోలీసులకు కీలకం కానుంది. ఇదిలా ఉంటే అబార్షన్ తర్వాత బాధితురాలు క్షేమంగానే ఉందని.. త్వరలోనే డిశ్చార్జ్ చేస్తామని ఆస్పత్రి వైద్యులు పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Saripodhaa Sanivaaram: నాని సినిమా లైన్ లీక్.. ఆ బ్లాక్ బస్టర్ కథతోనే?