NTV Telugu Site icon

Uttarakhand: నేపాలీ మహిళతో ఆర్మీ అధికారి డేటింగ్.. పెళ్లి చేసుకోవాలని అడిగినందుకు….

Murder Case

Murder Case

Uttarakhand: యువతితో అక్రమ సంబంధం పెట్టుకున్న ఆర్మీ అధికారి దారుణానికి ఒడిగట్టాడు. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ గా పనిచేస్తున్న రామెందు ఉపాధ్యాయ్ అనే వ్యక్తి నేపాల్‌కి చెందిన 30 ఏళ్ల యువతి శ్రేయ శర్మతో మూడేళ్లుగా డేటింగ్ చేస్తున్నాడు. ఇద్దరూ కూడా కలిసే ఉంటున్నారు. అప్పటికే పెళ్లైన రామెంద్ ఉపాధ్యాయ్, శ్రేయతో వివాహేతర సంబంధాన్ని నడుపుతున్నాడు. ఈ నేపథ్యంలో తనను పెళ్లి చేసుకోవాలని శ్రేయ ఒత్తిడి చేయడంతో దారుణంగా చంపేశాడు.

వివరాల్లోకి వెళ్లే పశ్చిమ బెంగాల్ సిలిగురిలో డ్యాన్స్ బార్ లో శ్రేయతో, రామెందుకు పరిచయం ఏర్పడింది. అప్పటికే పెళ్లి కావడం, శ్రేయ తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తీసుకురావడంతో ఆమెను చంపేశాడు. సిర్వాల్ గఢ్ ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో మహిళ మృతదేహాన్ని గుర్తించిన 24 గంటల్లో కేసును ఛేదించారు. పండిట్వారీ ప్రేమ్ నగర్‌లోని నిందితుడిని ఆయన ఇంటి వద్ద అరెస్ట్ చేశారు.

Read Also: Kim Jong Un: రష్యా వెళ్లిన కిమ్.. పుతిన్‌తో ఆయుధ ఒప్పందం..

బాధితురాలు శ్రేయతో రామెందు గత మూడేళ్లుగా వివాహేతర సంబంధాన్ని నడుపుతున్నాడు. ఇటీవల డెహ్రాడూన్ బదిలీ అయిన సమయంలో కూడా శ్రేయను అతనితో పాటు తీసుకువచ్చాడు. అక్కడే ఆమె కోసం అద్దెకు ఒక ఫ్లాట్ తీసుకున్నాడు. ఈ విషయాలను నిందితుడు విచారణలో ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు. శనివారం రాత్రి రాజ్‌పూర్ క్లబ్ లో శ్రేయతో కలిసి రామెందు ఉపాధ్యాయ్ మద్యం సేవించి లాంగ్ డ్రైవ్ కి తీసుకెళ్లాడు. నగర శివార్లలోకి రాగానే థానో రోడ్ లో రాత్రి 1.30 గంటల ప్రాంతాలో శ్రేయ తలపై సుత్తితో పదేపదే కొట్టి హత్య చేశాడు. ఆమె మరణించిన తర్వాత మృతదేహాన్ని రోడ్డు పక్కన పడేసి వెళ్లిపోయాడు. ఆ తరువాత పోలీసులు కేసును విచారించి నిందితుడు రామెందు ఉపాధ్యాయ్ ని అరెస్ట్ చేశారు.

Show comments