Kidnap Mystery: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అల్లూరి జిల్లా గ్రామ సచివాలయ మహిళా ఉద్యోగి కిడ్నాప్ మిస్టరీ వీడింది. బలవంతపు పెళ్లి కోసమే కిడ్నాప్ జరిగినట్లు పోలీసులు తేల్చారు. ప్రధాన నిందితుడితోపాటు అతనికి సహకరించిన మరో నలుగురిని అరెస్ట్ చేశారు. కిడ్నాపర్ల చెర నుంచి ఆమెను విడిపించారు.
రంపచోడవరం ప్రాంతం.. దేవీపట్నం మండలం, శరభవరం సచివాలయంలో సోయం శ్రీసౌమ్య విలేజ్ అసిస్టెంట్‌గా ఉద్యోగం చేస్తోంది. ఆమె విధుల్లో ఉండగానే కొంత మంది దుండగులు ఇన్నోవా కారులో వచ్చి బలవంతంగా ఎక్కించుకుని తీసుకుని వెళ్లారు. స్థానికులు వీడియో తీయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. అంతే కాదు ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది.
Modi Zelensky phone call: జెలెన్ స్కీతో మోడీ ఫోన్ కాల్.. ఏం చర్చించారంటే..!
వాయిస్: తల్లిదండ్రుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. కిడ్నాప్ చేసిన గ్యాంగ్‌ను ఒడిశాలో పట్టుకున్నారు. శ్రీసౌమ్యను వారి చెర నుంచి కాపాడారు. సౌమ్య ఇష్టానికి విరుద్ధంగా ఆమెను వివాహం చేసుకోవాలన్న ఉద్దేశ్యంతో ప్రధాన నిందితుడు కశింకోట అనిల్‌కుమార్ ఈ కిడ్నాప్‌కు పాల్పడ్డాడు. ఇందుకు శరభవరంకు చెందిన ఇద్దరు యువకులు కళ్యాణం ఉమామహేష్, రాగోలు దుర్గావిగ్నేస్ సహకరించారు. వీరు ముగ్గురినీ పోలీసులు వైరామవరం మండలం, పాతకోటలో అరెస్ట్ చేశారు. వీరితోపాటు సౌమ్య కదలికలపై రెక్కీ నిర్వహించిన పోతవరం గ్రామానికి చెందిన మాడే మణిమోహన్‌దొర, పూసం పవన్ కుమార్‌లను అదే గ్రామంలో అరెస్టు చేశారు.
వాయిస్: ఈ కేసులో మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. ప్రధాన నిందితుడు అనిల్ కుమార్‌పై గంజాయి కేసుతో పాటు మరో నాలుగు క్రిమినల్ కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. బాధితురాలిని సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించినట్లు డీఎస్పీ తెలిపారు. ముఖ్యమైన మార్గాలను మూసివేయడం, చెక్‌పోస్టులకు అలర్ట్ ఇవ్వడం, జీపీఎస్ ట్రాకింగ్, సీసీ టీవీ ఫుటేజ్ ద్వారా నిందితుల కదలికలను గుర్తించడం జరిగిందని డీఎస్పీ తెలిపారు.
iQOO Z10 Turbo+ 5G vs OPPO Reno 14 5G: మిడ్ రేంజ్‌లో బ్యాటరీ, కెమెరా, పనితీరు.. ఎవరిదీ పైచేయి?
శరభవరంలో సౌమ్యను కిడ్నాప్ చేసిన తరువాత గట్టి నిఘా ఉందని తెలుసుకున్న కిడ్నాపర్లు కిడ్నాప్‌కు వినియోగించిన వాహనాన్ని జగ్గంపేట సమీపంలో నిర్మానుష్య ప్రదేశం వద్ద వదలి.. మరో వాహనంలో పాతకోట గ్రామానికి పరారైనట్లు పేర్కొన్నారు. నిందితులు నిర్వహించిన ఆర్థిక లావాదేవీలను తెలుసుకోవడం ద్వారా వారున్న ఖచ్చితమైన ప్రదేశాన్ని గుర్తించగలిగామని తెలిపారు. మొత్తానికి నిందితులను అరెస్ట్ చేయడంతో కిడ్నాప్ ఘటన సుఖాంతమైంది. ఐతే వారిని కఠినంగా శిక్షించాలని యువతి తల్లిదండ్రులు కోరుతున్నారు.
