Uttar Pradesh: దేశంలో అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. చివరకు అభంశుభం తెలియని చిన్నారులు కూడా కామాంధుల అఘాయిత్యాలకు బలైపోతున్నారు. ఇప్పటికే ఉజ్జయినిలో 15 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇదిలా ఉంటే ఉత్తర్ ప్రదేశ్ లోని అలీఘర్ ప్రాంతంలో ఏడేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేశారు.
బాలికపై అత్యాచారం, హత్య చేసి కేసులో సువాలిన్ అతని సోదరుడు రిజ్వాన్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు బాలిక పొరుగు ఇంటి వాడే. బాలికకు చిప్స్ కొనిస్తానని ఆశ చూపించి అత్యాచారానికి ఒడిగట్టాడు. అనంతరం గొంతు కోసి హత్య చేసి, మృతదేహాన్ని సమీపంలో ఉన్న ఇంటి టెర్రస్ పై దాచి పెట్టాడు.
Read Also: Ujjain Case: ఉజ్జయిని మైనర్ రేప్ కేసు.. తప్పించుకునేందుకు నిందితుడి యత్నం..
బాలిక కనిపించడం లేదని ఫిర్యాదు అందడంతో, పోలీసులు సీసీటీవీ ఫుటేజీ చూసి నిందితుడు సువాలిన్ ను గుర్తించారు. బాలిక మృతదేహాన్ని దాచేందుకు సహాయం చేసిన అతని సోదరుడు రిజ్వాన్ ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. బాలిక మృతదేహం రక్తంతో తడిసిపోయిందని, పోస్టుమార్టం నివేదికలో అత్యాచారం జరిగినట్లు తేలిందని పోలీసులు వెల్లడించారు.
అలీఘర్ లోని తుర్క్‌మన్ గేట్ ప్రాంతలో ఉదయం బాలిక మిస్సైనట్లు సమాచారం రావడంతో పోలీసులు పరిసరాల్లోని వెతకడం ప్రారంభించారు. అనంతరం ఓ ఇంటి పైకప్పుపై మృతదేహాన్ని గుర్తించారు. నిందితుడు చిప్స్ ప్యాకెట్ తో ప్రలోభపెట్టి బాలికను ఇంట్లోకి తీసుకెళ్లాడని అత్యాచారం చేసి మస్లిన్ గుడ్డతో గొంతుకోసి హత్య చేశాడని పోలీసులు తెలిపారు. ఈ కేసుపై సమగ్ర విచారణ జరుపుతున్నట్లు అధికారులు వెల్లడించారు.