Rajahmundry ATM Robbery Case: ఏటీఎంలలో నింపాల్సిన డబ్బులతో ఓ ఉద్యోగి పరారయ్యాడు.. ఏకంగా రూ.2 కోట్ల 20 లక్షలకు పైగా క్యాష్‌తో కనబడకుండా పోయాడు.. అంతేకాదు.. గుండు గీయించుకున్నాడు.. కానీ, కేవలం 12 గంటలు కూడా గడవకముందే పోలీసులకు చిక్కాడు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాజమండ్రి పోలీసులకు చిక్కిన ఘరానా దోపిడికి పాల్పడిన హీటాచీ క్యాష్ మేనేజ్ మెంట్ సంస్థ ఉద్యోగి వాసంశెట్టి అశోక్.. ఏటీఎంల్లో నింపాల్సిన రెండు కోట్ల 20 లక్షల 50 వేల రూపాయలతో అశోక్ పరారయ్యాడు.. హెచ్‌డీఎఫ్‌సీ దానవాయిపేట బ్రాంచ్ నుండి డబ్బులు విత్ డ్రా చేసి బయట ఏటీఎం సెక్యూరిటీ కళ్లు గప్పి దోడ్డి దారిన పరారయ్యాడు అశోక్.. ఇక, హీటాచీ క్యాష్ మేనేజ్ మెంట్ సంస్థ యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన రాజమండ్రి వన్ టౌన్ పోలీసులు.. ఆరు బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు..
Read Also: Liquor Shops Closed: 28, 29 తేదీల్లో హైదరాబాద్ లో వైన్ షాపులు పూర్తిగా బంద్..
అయితే, నిందితుడు అశోక్ డబ్బులతో సిఫ్ట్ కారులో ఉడాయించిననట్లు సమాచారం సేకరించారు పోలీసులు.. కారును అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో వదిలి పరారయ్యాడు.. స్వగ్రామం కపిలేశ్వరం మండలం మాచర్ల మెట్ట గ్రామంలోని తన ఇంట్లో ఉన్న అశోక్ ను తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.. తనను ఎవరూ గుర్తుపట్టకుండగా ఉండే విధంగా గుండు చేయించుకుని ఊళ్లో తిరిగాడట అశోక్.. మొత్తంగా ఘటన జరిగిన 12 గంటల లోపే ఘరానా దోపిడీ కేసును ఛేదించారు రాజమండ్రి పోలీసులు.. దోపిడీ చేసిన రెండు కోట్ల 20 లక్షల 50 వేల రూపాయలతోపాటు కారు స్వాధీనం చేసుకున్నారు.. ఈ కేసులో ఉదయం 11 గంటలకు రాజమండ్రిలో మీడియా ముందు నిందితులను ప్రవేశపెట్టనున్నారు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహామూర్తి.
