రోజురోజుకు ఆడవారికి లైంగిక వేధింపులు ఎక్కువైపోతున్నాయి.. ఎక్కడ కామాంధులు ఆడవారిని వదలడం లేదు. తాజాగా నడిరోడ్డుపై ఇద్దరు యువతులను ఒక యువకుడు లైంగిక వేధింపులకు గురిచేసిన ఘటన మధ్యప్రదేశ్ లో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళితే.. భోపాల్ నగరంలోని కమలా నగర్ కి చెందిన ఒక యువతి(28) కుటుంబంతో సహా నివసిస్తోంది. రెండు రోజుల క్రితం ఆమె తన సోదరితో పాటు రాత్రి 10.30 నిమిషాలకు వేకింగ్ కి బయల్దేరింది. అక్కాచెల్లెళ్లు ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్తుండగావెనక నుంచి ఒక యువకుడు బైక్ పై వచ్చి వారి ముందు ఆపాడు. అనుకోని సంగీతనతో షాక్ అయిన వారు అతను ఎవరు అనేది తెలియకపోవడంతో భయపడుతూ నిలబెట్టారు. వెంటనే అతడు తన ప్యాంట్ జిప్ తీసి ప్రైవేట్ భాగాన్ని చూపిస్తూ వారికి అసభ్యంగా సైగలు చేయడం మొదలుపెట్టాడు. దీంతో ఖంగుతిన్న వారు గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు బయటికి వచ్చారు.
ఇక స్థానికులు రావడం గమనించిన అతను భయంతో పరారయ్యాడు. ఈ ఘటనపై యువతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సదురు యువకుడు బైక్ నెంబర్ నోట్ చేసుకున్నామని, తమను అతను లైంగికంగా వేధించాడని తెలిపారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
