Hair Cut: బార్బర్ చేసిన హెయిర్ కట్ నచ్చలేదని.. బాత్రూంలోకి వెళ్లి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
A Teenager Took His Life By Jumping From 16th Floor Over Hair Cur Issue In Maharashtra: ఇప్పుడంతా సోషల్ మీడియా ట్రెండ్ నడుస్తోంది కాబట్టి.. చిన్న చిన్న పిల్లలు సైతం స్టైలిష్‌గా తయారవుతున్నారు. నలుగురిలో అందంగా కనిపించేందుకు.. ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాళ్లకు వేసుకునే షూస్ దగ్గర నుంచి హైయిర్ కట్ దాకా.. ప్రతీదీ స్టైలిష్‌గా మలుచుకోవడంలో దృష్టి సారిస్తున్నారు. మరీ ముఖ్యంగా.. హెయిర్ కట్ విషయంలో మరీ పకడ్బందీగా ఉంటున్నారు. హెయిర్ స్టైల్ ఎంత బాగుంటే.. లుక్ పరంగా చూడ్డానికే అంతే అందంగా ఉంటారు కాబట్టి, ట్రెండ్‌కి తగినట్టు స్టైలిష్ హెయిర్ కట్ చేయించుకుంటున్నారు. ఒకవేళ హెయిర్ కట్ తేడా కొడితే.. ఇంటి నుంచి బయటకు రావడానికి కూడా ఇష్టపడట్లేదు. దీన్ని బట్టి.. ఈ తరం యువకులు హెయిర్ కట్ విషయంలో ఎంత సీరియస్‌గా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.
Extramarital Affair: దారుణం.. నాలుగు నెలల గర్భిణిని బలి తీసుకున్న ‘వివాహేతర సంబంధం’
Also Read
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
అయితే.. మహారాష్ట్రకు చెందిన ఓ టీనేజర్ మాత్రం ఎవ్వరూ ఊహించని పని చేశాడు. బార్బర్ చేసిన హెయిర్ కట్ నచ్చకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన అతగాడు.. ఏకంగా తన ప్రాణాలే తీసుకున్నాడు. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. మహరాష్ట్రలోని భయాందర్ ప్రాంతానికి చెందిన 13 ఏళ్ల బాలుడు జుట్టు విపరీతంగా పెంచుకోవడంతో, అతని కుటుంబ సభ్యులు ఆ బాలుడికి హెయిర్ కట్ చేయించారు. అయితే.. బార్బర్ చేసిన హెయిర్ కట్ ఆ బాలుడికి ఏమాత్రం నచ్చలేదు. ఇంటికి వెళ్లిన తర్వాత పదే పదే అద్దంలో చూసుకుంటూ.. తనకు ఆ హెయిర్ స్టైల్ నచ్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. కొన్ని రోజుల్లో జుట్టు పెరుగుతుందని కుటుంబ సభ్యులు చెప్పినా.. అతని కోపం చల్లారలేదు. అతడు ఓవైపు లోలోపలే కుమిలిపోతూనే.. మరోవైపు కోపాన్ని ప్రదర్శించాడు. ఒకానొక దశలో అతని కోపం నషాళానికి ఎక్కింది.
Woman Dances: ఢిల్లీ మెట్రో ప్లాట్‌ఫారమ్‌పై యువతి డ్యాన్స్.. నెటిజన్లు రియాక్షన్ ఇది..
ఆ కోపంలో ఆ బాలుడు నేరుగా బాత్రూంలోకి వెళ్లాడు. ఎంతసేపటికీ బయటకు రాలేదు. అనంతరం బాత్రూం కిటికీ తెరిచి.. 16వ అంతస్తు నుంచి కిందకు దూకేశాడు. ఈ ఘటనలో అతడు తీవ్ర గాయాలపాలవ్వడంతో.. అక్కడికక్కడే మృతి చెందాడు. కేవలం హెయిర్ కట్ నచ్చలేదని క్షణికావేశంలో ఆ బాలుడు తీసుకున్న నిర్ణయం.. కుటుంబంలో తీవ్ర విషాదం నింపేసింది. తమకు అండగా ఉంటాడనుకున్న కుమారుడు.. ఇలా అర్థాంతరంగా ప్రాణాలు తీసుకోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. మరోవైపు.. ఈ ఘటన సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని, కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
INDIA Bloc: రాహుల్ నిరసనకు అఖిలేష్ దూరం.. కాంగ్రెస్-SP మధ్య గ్యాప్?
-
పండుగ పూట EMIల మోత.. హోమ్ లోన్ తీసుకున్నవారిపై భారం ఎంతంటే!+
-
Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
-
Zodiac Signs : రాహు-కేతువుల నక్షత్ర సంచారం.. ఈ 4 రాశుల జాతకులకు అదృష్ట యోగం
-
PM Modi: ‘‘మోడీని దించేందుకు ప్రయత్నిస్తున్నారు’’.. సెర్బియా మాజీ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!