NTV Telugu Site icon

United Alliance Technology: ఉద్యోగాల పేరిట భారీ మోసం.. బోర్డు తిప్పేసిన కంపెనీ

Company Fraud

Company Fraud

A Software Company In Hitech City Cheated In The Name Of Jobs: ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల నుంచి భారీ డబ్బులు వసూలు చేసి.. ఆ తర్వాత కంపెనీలు బోర్డు తిప్పేస్తున్న ఘటనలు ఈమధ్య తరచుగా వెలుగు చూస్తున్నాయి. తాజాగా మరో కంపెనీ కూడా అలాగే బోర్డు తిప్పేసింది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులను నమ్మించి, వారి వద్ద నుంచి ఆ సంస్థ లక్షలకు లక్షలు వసూలు చేసింది. మొదట్లో ట్రైనింగ్ ఇస్తున్నట్టుగా నాటకాలు కూడా ఆడటంతో.. తమకు ఉద్యోగాలు పక్కాగా వస్తాయని బాధితులు నమ్మారు. తీరా చూస్తే.. తాము దారుణంగా మోసపోయామని గ్రహించి, పోలీసుల్ని ఆశ్రయించారు. ఆ వివరాల్లోకి వెళ్తే..

Kunamneni Sambasiva Rao: బీజేపీతోనే దేశానికి ప్రమాదం.. బీజేపీ వ్యతిరేక శక్తులు ఏకం కావాలి

కొండాపూర్‌లోని ఏఎంబీ మాల్‌కి ఎదురుగా యునైటెడ్ అలయన్స్ టెక్నాలజీ ఐటీ పేరుతో ముగ్గురు వ్యక్తులు ఒక కంపెనీని ఏర్పాటు చేశారు. మంచి ప్యాకేజ్‌లతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని ప్రకటనలు ఇచ్చారు. ఆ కంపెనీలోని ఆర్భాటాలను, విధివిధానాల్ని చూసి.. నిరుద్యోగులు ఆ సంస్థని సంప్రదించడం మొదలుపెట్టారు. సాఫ్ట్‌వేర్ జాబ్ తప్పకుండా ఇప్పిస్తామని చెప్పి.. ట్రైనింగ్ కోసం రూ.1.50 లక్షల నుంచి 3.50 లక్షల వరకు బాధితుల నుంచి డబ్బులు వసూలు చేశారు. అలా బాధితుల నుంచి భారీ మొత్తం వసూలు చేసిన తర్వాత.. నెల రోజుల పాటు ఆన్‌లైన్‌లో ట్రైనింగ్ క్లాసులు నిర్వహించారు. ఇంటర్వ్యూ సమయంలో చురుకుగా ఎలా వ్యవహరించాలి? ఎటువంటి ప్రశ్నలకు ఎలాంటి సమాధానాలు ఇవ్వాలి? అనే విషయాలపై అవగాహన కల్పిస్తూ.. పెద్ద బిల్డప్పులే ఇచ్చారు.

K Laxman: యువత బతుకుల్ని తెలంగాణ ప్రభుత్వం ఆగం చేసింది

అయితే.. గత నెల రోజుల నుండి కంపెనీ యాజమాన్యం నుంచి బాధితులకు ఎలాంటి స్పందన రాలేదు. దీంతో.. బాధితులందరూ కలిసి కొండాపూర్‌లో ఉన్న కంపెనీ వద్దకు వచ్చారు. అక్కడికి రాగానే.. అందరికీ ఒక్కసారిగా ఊహించని షాక్ తగిలింది. అక్కడ కంపెనీ మూతపడి ఉంది. అప్పుడు తాము మోసపోయామన్న అసలు విషయం తెలిసింది. దీంతో.. నేరుగా మాధాపూర్ పోలీస్ స్టేషన్‌కి వెళ్లి, సదరు కంపెనీపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Show comments