NTV Telugu Site icon

Crime: మొదట ప్రపోజ్ చేస్తాడు.. తిరస్కరిస్తే చంపేస్తాడు.. సీరియల్ కిల్లర్ కథ

Crime

Crime

ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో అరెస్టయిన సీరియల్ కిల్లర్ విన్యాసాలు చూసి అందరూ షాక్ అవుతున్నారు. మధ్య వయస్కులైన మహిళలను ఒంటరిగా కనబడితే వారికి ప్రపోజ్ చేసేవాడు. ఆ మహిళ తన ప్రపోజల్ ను తిరస్కరిస్తే చంపేస్తాడు. మొదట మహిళను గొంతు నులిమి చంపడం.. లేదా చీరతో ఆమె మెడకు ముడి వేసి ప్రాణాలు తీయడం చేశాడు. బరేలీకి 25 కిలోమీటర్ల పరిధిలో తొమ్మిది మంది మహిళలను ఇలాగే చంపాడు.

READ MORE: Jeedimetla Accident: ప్రాణం తీసిన అతివేగం.. కారు ఢీకొట్టడంతో వ్యక్తి స్పాట్ డెడ్..

ఆ సీరియల్ కిల్లర్ పేరు కుల్దీప్ కుమార్ గంగ్వార్. ఇంత ప్రమాదకరంగా ఎలా మారాడని అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. శిష్‌గఢ్‌, షాహి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మహిళల హత్యల కేసులో కులదీప్‌ కుమార్‌ గంగ్వార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అతను నవాబ్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బకర్‌గంజ్ గ్రామ నివాసి. విచారణలో..నిందితుడు కుల్దీప్ తనకు ఇద్దరు సోదరీమణులు ఉన్నారని, అతని తల్లి చనిపోయిందని చెప్పాడు.

READ MORE: Saina Nehwal: విద్యార్థులు క్రీడల్లో రాణించేందుకు తల్లిదండ్రులు ప్రోత్సహించాలి: సైనా

2014లో నిందితుడి వివాహం..
తనకు 2014లో వివాహమైందని నిందితుడు పోలీసులకు తెలిపాడు. భార్యతో కూడా మామూలుగా ప్రవర్తించలేదు. ఆమె నిందితుడితో ఉండటానికి నిరాకరించినా..అతడు విడిచిపెట్టలేదు. ఆమెను కూడా కొట్టేవాడు. అతని హింసాత్మక ధోరణులతో విసుగు చెంది.. అతని భార్య కూడా కొన్ని సంవత్సరాల క్రితం విడిచిపెట్టింది. ఈ కారణాల వల్ల కుల్దీప్ గంగ్వార్ గంజాయి, సల్ఫా, మద్యం మొదలైనవాటిని సేవించడం ప్రారంభించాడు.

READ MORE: Bomb Threat : నా బ్యాగ్‌లో బాంబు ఉంది.. కొచ్చి ఎయిర్‌పోర్టులో ప్రయాణికుడు అరెస్ట్

ఈ నిందితుడిని పట్టుకోవడానికి 22 బృందాలు..
ఈ సైకో కిల్లర్‌ను అరెస్టు చేసేందుకు ‘ఆపరేషన్ తలాష్’ ప్రారంభించామని, ఇందులో 22 బృందాలుగా ఏర్పడి 25 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ ఆపరేషన్ నిర్వహించామని బరేలీ ఎస్‌ఎస్పీ అనురాగ్ ఆర్య తెలిపారు. ఇందుకోసం 600కు పైగా కొత్త కెమెరాలను అమర్చారు. 1500 పాత సీసీ కెమెరాల సాయం తీసుకుని 1.5 లక్షలకు పైగా మొబైల్ ఫోన్ల డేటాను వెలికితీసి నిఘా పెట్టగా.. అప్పుడే నిందితులను పోలీసులు చేరుకోగలిగారు.