A Man Stabbed To Death In Bengaluru Over Cigerette Sharing Issue: సిగరెట్ తాగే అలవాటున్న వ్యక్తులు దాన్ని సగం-సగం షేర్ చేసుకుంటుంటారు. కొందరైతే దొరికిందే ఛాన్స్ అనుకొని, ఎక్కువ పఫ్స్ లాగించేసి, మిగిలింది తమ స్నేహితులకు ఇచ్చేస్తుంటారు. ఈ క్రమంలో వారి మధ్య సరదా గొడవలు జరుగుతుంటాయి. ‘నువ్వే మొత్తం లాగించేస్తే, ఇక నాకేం మిగులుతుంది?’ అంటూ చిన్న చిన్న వాగ్వాదాలు జరుగుతాయి. అవి కూడా కామెడీ కోణంలోనే తప్ప.. మరీ ద్వేషం పెంచుకునే స్థాయికి వెళ్లదు. కానీ.. కర్ణాటకలో మాత్రం ఇలాంటి వ్యవహారం సీరియస్‌గా మారింది. ఒకరి ప్రాణాలు తీసేంత స్థాయికి చేరింది. ఆ వివరాల్లోకి వెళ్తే..
Akasa Air: ఆకాశ ఎయిర్ లైన్స్ కు ఉద్యోగులు కావాలి.. కంపెనీ సీఈఓ కీలక ప్రకటన
కలబుర్గి (గుల్బర్గా) జిల్లాకు చెందిన మల్లినాథ్ బిరాదర్ అనే వ్యక్తి.. బెంగళూరులోని మెజెస్టిక్ ప్రాంతంలో ఒక హోటల్‌లో పని చేస్తున్నాడు. అదే హోటల్‌లో అతనితో పాటు గణేశ్ అనే వ్యక్తి కూడా పని చేస్తున్నాడు. బుధవారం సాయంత్రం వీళ్లిద్దరు కలిసి ఒక షాప్ వద్దకు వెళ్లారు. అక్కడ ఓ సిగరెట్ కొనుగోలు చేశారు. అప్పుడే అసలు సమస్య మొదలైంది. సిగరెట్ షేరింగ్ విషయంలో ఆ ఇద్దరి మధ్య ఓ వివాదం తలెత్తింది. అది చినికి చినికి గాలివానగా మారి, పెద్ద గొడవగా ముదిరింది. ఒకరిపై మరొకరు దాడి కూడా చేసుకున్నారు. అప్పుడు మంజునాథ్ అనే వ్యక్తి జోక్యం చేసుకొని, పరిస్థితిని అదుపు చేశాడు. ఆ గొడవ మరింత ముదరకముందే, సద్దుమణిగేలా చేశాడు. దీంతో.. ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోయారు.
Rishabh Pant: రిషభ్ పంత్‌కి ఢిల్లీ క్యాపిటల్స్ అరుదైన గౌరవం
అయితే.. మరుసటి రోజు సాయంత్రం మళ్లీ ఈ గొడవ గురించి గణేశ్ ప్రస్తావించాడు. దీంతో.. గణేశ్, మల్లినాథ్ మధ్య మరోసారి గొడవ మొదలైంది. ఈసారి వీరితోపాటు మంజునాథ్ కూడా ఉన్నాడు. ఈ క్రమంలో గనేశ్ కోపం నషాళానికి ఎక్కింది. ఆ కోపంలో అతడు తనతో పాటు తెచ్చుకన్న కత్తి తీసుకొని, మల్లినాథ్‌పై ఎటాక్ చేశాడు. అనేక పోట్లు పొడిచాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన మల్లినాథ్.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలాడు. అటు.. గణేశ్, మంజునాథ్ కూడా తీవ్ర గాయాలపాలయ్యారు. వాళ్లు మాత్రం సురక్షితంగానే ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.