NTV Telugu Site icon

Extramarital Affair: వివాహిత ప్రాణాల్ని బలిగొన్న వివాహేతర సంబంధం

Illegal Affair

Illegal Affair

A Man Killed Woman In Nizamabad For Having Affair With His Father: వివాహేతర సంబంధాల కారణంగా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. కొన్ని ప్రాణాలు కూడా పోయాయి. ఇప్పుడు ఈ వివాహేతర సంబంధమే ఒక మహిళ ప్రాణాలను బలిగొంది. ఆమె ఇద్దరు పిల్లలను అనాథల్ని చేసింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ జిల్లాలోని వర్ని మండలం బడాపహాడ్‌లో షహనా బీ అనే తన ఇద్దరు కుమార్తెలతో కలిసి నివసిస్తోంది. భర్త తోడు లేకపోవడంతో.. ఒక వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. కొన్నాళ్లు ఎవరికీ తెలియకుండా తమ సంబంధాన్ని కొనసాగించారు. కానీ.. ఆ వ్యక్తి తనయుడైన షేక్ నిజాంకి వీరి బంధం గురించి తెలిసిపోయింది.

Eravathri Anil Kumar: కోమటిరెడ్డి RSS అజెండా అమలు చేస్తున్నారు

అప్పటినుంచి షహనాబీ మీద నిజాం పగ పెంచుకున్నాడు. ఎలాగైనా తన తండ్రి నుంచి ఆమెను దూరం చేయాలని అనుకున్నాడు. ఈ క్రమంలోనే అతడు కత్తితో దాడి చేసి, ఆమెను దారుణంగా హతమార్చాడు. షహనాబీ మృతితో ఆమె పిల్లలిద్దరు అనాథలయ్యారు. ఆమె కుటుంబ సభ్యులు.. మృతురాలి మృతదేహంతో నిందితుడు నిజాం ఇంటి ముందు ధర్నాకు దిగారు. మృతురాలి పిల్లల్ని నిందితుడి కుటుంబీకులే చూసుకోవాలని నిరసనకు దిగారు. పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా.. తమ డిమాండ్స్ ఒప్పుకునేదాకా ఆందోళన విరమించమంటూ మృతరాలు బంధవులు భీష్మించి కూర్చున్నారు. దీంతో.. పోలీసులు న్యాయం చేస్తామని వారికి భరోసా కల్పించారు. మరోవైపు.. హత్య కేసు నమోదు చేసి, నిందితుడ్ని అరెస్ట్ చేశారు.

Naveen Case: నవీన్ హత్య కేసులో ఊహించని ట్విస్ట్.. A2 నిందితురాలిగా ప్రియురాలు

Show comments