Site icon NTV Telugu

Vizag Honey Trap Case: జాయ్ జెమిమా హనీ ట్రాప్ కేసులో బిగ్‌ ట్విస్ట్..

Vizag Honey Trap Case

Vizag Honey Trap Case

Vizag Honey Trap Case: విశాఖపట్నంలో సంచలనం రేపిన జాయ్ జెమిమా హనీ ట్రాప్ కేసులో మరో కీలక మలుపు తిరిగింది.. మాజీ ఎంపీ వ్యాఖ్యలతో రాజకీయ రంగు పులుముకుంది హనీ ట్రాప్ కేసు.. మొదటి సారి మీడియా ముందుకు వచ్చారు బాధితులు.. హనీ ట్రాప్ కేసుపై మాజీ ఎంపీ హర్ష కుమార్ కామెంట్స్ పై బాధితుల కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. చేసిన అభియోగాలపై మండిపడ్డారు.. కొద్ది రోజుల క్రితం జాయ్ జెమిమా క్యారెక్టర్ పై పాజిటివ్ గా మాట్లాడారు మాజీ ఎంపీ హర్ష కుమార్. బాధితుల వద్ద నుండి విశాఖపట్నం సీపీ డబ్బులు తీసుకొని ఆమెను ఇరికించారాని ఆరోపణలు చేశారు.. భీమిలికి చెందిన NRI ను ఇంస్టాగ్రామ్ లో ట్రాప్ చేసి ముగ్గులోకి దించిన జాయ్ జెమిమా.. NRI తల్లి లక్ష్మిని కలిసి బిజినెస్ డెవల్పర్ గా ప్రమోట్ చేస్తాను అని చెప్పింది… USA నుండి NRI ను రప్పించి ఓ హోటల్ లో నిర్భంధించి మత్తు మందు ఇచ్చిందని జెమిమాపై అభియోగాలు ఉన్నాయి.. ఆ తర్వాత దఫా దఫాలుగా రూ. 10 లక్షలు వరకు కాజేసిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు.. అయితే, ఈ కేసు వెనుక రాజకీయ నాయకుల హస్తం ఉందని, సమగ్ర విచారణ జరపాలని NRI తల్లి లక్ష్మి డిమాండ్ చేశారు..

Read Also: PM Modi-Adani Bag: ప్రియాంక గాంధీ బ్యాగ్‌పై మోడీ-అదానీ ఫోటోలు.. అభినందించిన రాహుల్

Exit mobile version