Site icon NTV Telugu

15 ఏళ్ల కుర్రాడి దారుణం.. యువతిని ఈడ్చుకెళ్లి, గొంతుకోసి…?

కామాంధులు.. ఆడవారిని బతకనియ్యడం లేదు. చిన్నా, పెద్ద.. వావివరుసలు మరిచి కామంతో కళ్లు మూసుకుపోయి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇటీవల కేరళలో ఒక మైనర్ బాలుడు, 21 ఏళ్ల యువతిని ఈడ్చుకెళ్లి అత్యచారాయత్నానికి ప్రయత్నించినా ఘటన అందరిని ఉలిక్కిపడేలా చేసింది. తాజాగా ఈ ఘటనలో షాకింగ్ నిజాలను పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కేరళలోమీ మల్లప్పురం గ్రామానికి చెందిన 21 ఏళ్ల యువతి సోమవారం కంప్యూటర్ క్లాస్ కని బయల్దేరింది. కొద్దిదూరం వెళ్లగానే రోడ్డు పక్కన ఒక 15 ఏళ్ల కుర్రాడు ఆమెను అడ్డగించాడు. ఆమెను గట్టిగా పట్టుకొని లైంగిక దాడికి ప్రయత్నించాడు. యువతి తీవ్రంగా ప్రతిఘటించడంతో పక్కనే ఉన్న నిర్మానుష్య ప్రదేశానికి ఆమెను ఈడ్చుకెళ్లి, రాయితో తలపై బాది అత్యాచారానికి పాల్పడబోయాడు. యువతి ఏదో విధంగా తప్పించుకోబోయేసరికి గొంతుకోసి రేప్ చేయడానికి ట్రై చేశాడు.

కానీ, యువతి చాకచక్యంగా తప్పించుకొని దగ్గర్లో ఉన్న ఇంటికి పారిపోయి ప్రాణాలు దక్కించుకుందని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం యువతి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉన్నా, జరిగిన సంఘటన గురించి వివరించే పరిస్థితిలో లేదని మలప్పురం జిల్లా పోలీసు చీఫ్ సుజిత్ దాస్ ఎస్ తెలిపారు. నిందితుడ్ని అరెస్ట్ చేసి జువైనల్ జస్టిస్ బోర్డు ముందు హాజరుపరిచామని. తదుపరి విచారణ కొనసాగుతోందని అన్నారు. ఈకేసులో యువతి వాంగ్మూలం చాలా ముఖ్యమని, ఆమె చెప్పేవరకు ఈ కేసు విచారణ ఆలస్యమవుతుందని తెలిపారు.

Exit mobile version