A Hyderabadi Man Arrested For Cheating In The Name Of Job: నిరుద్యోగుల్ని టార్గెట్ చేసుకొని.. కొందరు దుండగులు మోసాలకు పాల్పడుతున్న ఘటనలు ఈమధ్య తరచూ వెలుగు చూస్తున్నాయి. ఉద్యోగాల కోసం వెతుకుతున్న నిరుద్యోగుల బలహీనతను పసిగట్టి, వారిని ముగ్గులోకి దింపి, లక్షలకు లక్షలు డబ్బులు దండుకున్న తర్వాత మోసగాళ్లు మాయమవుతున్నారు. కొందరు కంపెనీల పేరుతో ఇలాంటి మోసాలకు పాల్పడుతుంటే, మరికొందరు ఆన్‌లైన్‌లో వల వేసి అమాయకుల నుంచి డబ్బులు దోచేసుకుంటున్నారు. ఇప్పుడు ఓ చీటర్ కూడా ఇలాంటి మోసానికే పాల్పడ్డాడు. ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి.. రూ.20 లక్షల సైబర్ మోసం చేశాడు. ఆ వివరాల్లోకి వెళ్తే..
Health Tips : త్వరగా బరువు తగ్గాలంటే ఈ తప్పులు అస్సలు చెయ్యకండి..
హైదరాబాబ్ చంపాపెట్‌కి చెందిన చీటర్ అంజనీ కుమార్.. ఈజీ మనీకి అలవాటు పడ్డాడు. ఈ నేపథ్యంలోనే అతగాడు.. తనకున్న ట్యాలెంట్‌ని చెడు పనులకు వినియోగించుకోవడం మొదలుపెట్టాడు. నిరుద్యోగుల్ని టార్గెట్ చేశాడు. ఆన్‌లైన్ జాబ్ పోర్టల్ ద్వారా.. ఉద్యోగాల కోసం అప్లై చేసుకున్న అభ్యర్థుల వివరాల్ని సేకరించాడు. ఆ అభ్యర్థులను సంప్రదించి.. ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికాడు. అయితే.. అందుకు తనకు కమీషన్‌గా అడిగినంత డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఉద్యోగాల కోసం పరితపిస్తున్న కొందరు నిరుద్యోగులు.. అతడు అడిగినంత డబ్బులు ఇవ్వడానికి ముందుకొచ్చారు. అలా వారి వద్ద నుంచి అంజనీ కుమార్ రూ. 20 లక్షల వరకు వసూలు చేశాడు. త్వరలోనే ఉద్యోగాలు వస్తాయని చెప్పి, ఒక్కసారిగా మాయం అయ్యాడు.
Bhatti Vikramarka: వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే.. ఎవ్వరూ ఆపలేరు..
రోజులు గడుస్తున్నా.. అంజనీ కుమార్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం, అతడు అందుబాటులోనూ లేకపోవడంతో.. బాధితులు తాము మోసపోయామని గ్రహించారు. దీంతో.. వాళ్లు సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదుతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. తమకు లభించిన సమాచారంతో అంజనీ కుమార్‌ని ట్రేస్ చేశారు. ఎట్టకేలకు ఆ చీటర్‌ని పట్టుకొని.. అరెస్ట్ చేశారు. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే.. గతంలోనూ అతడు ఇలాంటి మోసాలకు పాల్పడినట్లు విచారణలో తేలింది. పలుమార్లు జైలుకు వెళ్లాడు కూడా. అయినా బుద్ధి మార్చుకోకుండా, మోసాలకు పాల్పడుతున్నాడు.
