Site icon NTV Telugu

అర్ధరాత్రి నడిరోడ్డుపై ఆ ముగ్గురు మహిళలను ఆ గ్యాంగ్ ఏం చేసిందంటే..?

delhi

delhi

దేశంలో ప్రభుత్వం ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా మహిళలకు మాత్రం రక్షణ ఉండడం లేదు. నడిరోడ్డుపై ఆడవారు ఒంటరిగా తిరిగే రోజులు ఇంకా రాలేదని తెలుస్తోంది. లైంగిక వేధింపులు, అత్యాచారాలు, దాడులు ఇలా ఒకటని చెప్పలేకుండా ఉన్నాం.. తాజాగా దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున ఒక గ్యాంగ్ ముగ్గు మహిళపై దాడికి తెగబడ్డారు. ప్రస్తుతం ఈ దాడికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

వివరాలలోకి వెళితే.. ఢిల్లీలోని.. షాలిమార్‌బాగ్‌లో అర్ధరాత్రి ముగ్గురు మహిళలు కారు దిగారు.. వారు కారు దిగిన వెంటనే వెనుక నుంచి కొంతమంది యువకులు వారివద్దకు వచ్చి ఘర్షణకు దిగారు. అనంతరం వారిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. స్టిక్స్ తో వారిని గట్టిగా కొట్టి పరారయ్యారు. ఈ ఘటన గత నెల 19 న జరిగింది. ఈ దాడిలో గాయపడిన ఓ మహిళ.. చికిత్స అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆరోజు రాత్రి వీధిలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలించి, నిందితులను కనుక్కొనే ప్రయత్నంలో ఉన్నామని తెలిపారు. అయితే ఈ ఘర్షణకు కారణం ఏంటి..? వారికి మహిళలకు సంబంధం ఏంటి అనేది తెలియాల్సి ఉంది.

https://twitter.com/i/status/1465834833175711746
Exit mobile version