Site icon NTV Telugu

Crime News: జార్ఖండ్లో దారుణం.. లవర్ను చంపి 50 ముక్కలుగా నరికేశాడు..

Jharkhand

Jharkhand

Crime News: జార్ఖండ్‌ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు తన లివింగ్ ఇన్ పార్ట్నర్‌ను దారుణంగా హతమార్చాడు. ఆ తర్వాత శరీరాన్ని 40 నుంచి 50 ముక్కలుగా నరికిన ఘటన.. ఖుంటి జిల్లాలోని జరియాగఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. అయితే, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని జోర్దాగ్ గ్రామానికి చెందిన నరేష్ బెంగ్రా అనే యువకుడు గంగి కుమారి అనే యువతితో గత రెండేళ్లుగా సహ జీవనంలో ఉన్నారు.

Read Also: Hyderabad: లక్డికాపూల్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు.. మిగిలిపోయిన ఫుడ్ ను స్టోర్ చేసి నెక్స్ట్ డే సర్వ్..

అయితే, నరేష్ బెంగ్రా తన ప్రియురాలు గంగి కుమారికి తెలియకుండా మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. దీంతో ఈ విషయంలో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలోనే ఈ నెల 24వ తేదీన యువతిని తన ఇంటికి సమీపంలోని అటవీ ప్రాంతంలోకి తీసుకుపోయి గొంతు నులిమి చంపేసి.. అనంతరం శరీరాన్ని 50 ముక్కలుగా నరికి అడవిలోనే విసిరేశాడు. యువతి శరీరంలోని ఓ భాగాన్ని కుక్క తినడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అది గమనించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. మరి కొన్ని శరీర భాగాలను స్థానికంగా కనిపెట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు నరేశ్ బెంగ్రా అనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Exit mobile version