Site icon NTV Telugu

Beautician Cheated: బ్యూటీషియన్‌కి టోకరా.. లాభమని చెప్పి నిండా ముంచేశారు

Beautician Aog Cheating

Beautician Aog Cheating

A Beautician Cheated By AOG Company In Chittoor: రూపాయి పెట్టుబడికి అర్థరూపాయి లాభం వస్తుందంటే.. పెట్టుబడి పెట్టేందుకు ఎవరు ముందుకు రారు చెప్పండి. ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే.. వచ్చే లాభంతోనే హ్యాపీగా గడిపేయొచ్చని చాలామంది అనుకుంటారు. దీన్నే అలుసుగా తీసుకొని.. కొందరు దుండగులు భారీ మోసాలకు పాల్పడుతున్నారు. పెట్టుబడులు పెట్టేవారిని టార్గెట్ చేసుకొని.. భారీ లాభాలొస్తాయని మాయమాటలు చెప్పి.. వారి వద్ద నుంచి లక్షలకు లక్షలు కాజేసి.. చివరికి శఠగోపం పెట్టి జంప్ అయిపోతారు. ఇలాంటి సంఘటనే తాజాగా చిత్తూరులో చోటు చేసుకుంది. రూ.1 లక్ష పెట్టుబడి పెడితే, వారానికే రూ.10 వేలు వస్తాయని ఒక బ్యూటీషియన్‌ని నమ్మించి.. ఆమె వద్ద నుంచి ఏకంగా రూ.45 లక్షలు కాజేశారు. ఆ వివరాల్లోకి వెళ్తే..

Virupaksha Trailer: రుద్రవనాన్ని కాపాడే విరూపాక్ష వచ్చేశాడు

చిత్తూరు నగరంలోని చేపల మార్కెట్‌ వీధికి చెందిన అనురాధ.. కొంగారెడ్డిపల్లెలో బ్యూటీషియన్‌గా పనిచేస్తోంది. కొన్ని రోజుల క్రితం సమీప బంధువును కలిసినప్పటికీ.. పెట్టుబడికి సంబంధించిన చర్చలు జరిపారు. ఈ క్రమంలోనే బజారులో ‘ఏవోజీ’ అనే కంపెనీ ఉందని, అందులో డబ్బులు పెడితే భారీ లాభాలు వస్తాయని ఆ బంధువు చెప్పారు. దీంతో.. అనురాధ ఆ కంపెనీకి వెళ్లింది. ఆ కంపెనీలో ఉన్నవారిని కలవగా.. రూ.1 లక్ష పెట్టుబడి పెడితే, వారానికి రూ. 10 వేలు చొప్పున నెలకు రూ.40 వేలు వడ్డీ ఇస్తామని చెప్పారు. అంతేకాదు.. మూడేళ్ల తర్వాత పెట్టుబడి అమౌంట్‌ని కూడా తిరిగి ఇచ్చేస్తామని తెలిపారు. అయితే.. కంపెనీ నిబంధనల ప్రకారం తొలి మూడు నెలలకు వడ్డీ రాదని, నాలుగో నెల నుంచి మొత్తం వడ్డీ చెల్లిస్తామని ఆ కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. మొదటి మూడు నెలలు రాకపోతేనేం.. ఆ తర్వాత నుంచి తనకు భారీ లాభాలు వస్తాయి కదా అని ఆశ పడింది. అంతే.. తన దగ్గరున్న డబ్బు, ఆభరణాలు తాకట్టు పెట్టడంతో బంధువుల నుంచి అప్పు తీసుకొని ఏకంగా రూ.45 లక్షలు ఆ కంపెనీలో పెట్టుబడిగా ఇచ్చింది.

Extramarital Affair: జ్యోతిష్యుడి మెడకు చుట్టుకున్న ఎఫైర్.. పక్కా స్కెచ్ వేసి బలి

కట్ చేస్తే.. మూడు నెలలు గడిచిన తర్వాత తన వడ్డీ వసూలు చేసుకుందామని అనురాధ ఆ కంపెనీకి వెళ్లింది. తీరా అక్కడికి వెళ్లాక ఆమెకు దిమ్మతిరిగే షాక్ తగిలింది. ఆ కంపెనీ బోర్డు తిప్పేసిందని.. తాను దారుణంగా మోసపోయానని గ్రహించింది. దీంతో.. ఆమె పోలీసులను ఆశ్రయించింది. కేవలం ఈ ఒక్క బ్యూటీషియన్ మాత్రమే కాదు, ఇంకా చాలామంది ఆ కంపెనీలో భారీఎత్తున నగదు పెట్టి మోసపోయారు. రూ.కోట్లలో డిపాజిట్లు జరిగినట్టు తేలింది. ప్రస్తుతం బాధితురాలి ఫిర్యాదుపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని, ఇంకా ఎవరైనా బాధితులు ఫిర్యాదు చేస్తే వాటిపై కూడా కేసు నమోదు చేస్తామని పోలీసులు పేర్కొన్నారు.

Exit mobile version