Site icon NTV Telugu

Jharkhand: 16 ఏళ్ల బాలిక కిడ్నాప్.. గ్యాంగ్ రేప్.. వీడియో తీసి..

Jarkhand

Jarkhand

Jharkhand: జార్ఖండ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఇంట్లో ఉన్న 16 దళిత బాలికను బలవంతంగా కిడ్నాప్ చేసి దారుణానికి ఒడిగట్టారు. ఈ ఘటన రాష్ట్రంలోని హుస్సేనాబాద్ లో జరిగింది. బాలికను కిడ్నాప్ చేసి, ఊరి చివరకు తీసుకెళ్లి ఆరుగురు వ్యక్తులు అత్యంత దారుణంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ అఘాయిత్యాన్ని సెల్ ఫోన్ లో చిత్రీకరించి వైరల్ చేస్తామని సదరు బాలికను నిందితులు బెదిరించారు.

Read Also: Gold Standard Burger: ఈ బర్గర్ ధర రూ. 55,000.. ఎందుకంత స్పెషల్..?

హుస్సెనాబాద్ పీఎస్ పరిధిలోని పాలమూలో ఈ ఘటన జరిగింది. గురువారం అర్థరాత్రి ఒంటరిగా ఉన్న బాలికపై కన్నేసిన ఆరుగురు నిందితులు బలవంతంగా కిడ్నాప్ చేశారు. ఆ సమయంలో బాలిక తల్లిదండ్రులు పెళ్లికి వెళ్లడంతో బాలిక ఇంట్లోనే ఒంటరిగా ఉంది. గ్రామ శివారుకు తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితులంతా అదే గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. నిందితులు ఈ మొత్తం అఘాయిత్యాన్ని వీడియో తీసి ఎవరికైనా చెబితే వైరల్ చేస్తామని బెదిరించారు.

శుక్రవారం తల్లిదండ్రులు ఇంటికి తిరిగి రాగానే, జరిగిన ఘటన గురించి బాలిక వారికి తెలియజేసింది. గ్రామస్తుల సహాయంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. అత్యాచారానికి పాల్పడిన నిందితులంతా బాధితురాలి ఇంటి చుట్టుపక్కల నివాసం ఉంటున్నారు. నిందితులను నితీష్ కుమార్ ఠాకూర్, సచిన్ ఠాకూర్, రాజు ఠాకూర్, రోహిత్ ఠాకూర్, సచిన్ ఠాకూర్ అలియాస్ మజిలా, దినేష్ ఠాకూర్‌లగా పోలీసులు గుర్తించారు. ఈ కేసులో గ్రామస్తులు నిందితుల్లో ఒకరిని పట్టుకోగా.. మిగతా ఐదుగురు పరారయ్యారు. వీరికోసం పోలీసులు వేట సాగిస్తున్నారు. నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. బాధితురాలని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు.

Exit mobile version