Jharkhand: 16 ఏళ్ల బాలిక కిడ్నాప్.. గ్యాంగ్ రేప్.. వీడియో తీసి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jharkhand: జార్ఖండ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఇంట్లో ఉన్న 16 దళిత బాలికను బలవంతంగా కిడ్నాప్ చేసి దారుణానికి ఒడిగట్టారు. ఈ ఘటన రాష్ట్రంలోని హుస్సేనాబాద్ లో జరిగింది. బాలికను కిడ్నాప్ చేసి, ఊరి చివరకు తీసుకెళ్లి ఆరుగురు వ్యక్తులు అత్యంత దారుణంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ అఘాయిత్యాన్ని సెల్ ఫోన్ లో చిత్రీకరించి వైరల్ చేస్తామని సదరు బాలికను నిందితులు బెదిరించారు.
Read Also: Gold Standard Burger: ఈ బర్గర్ ధర రూ. 55,000.. ఎందుకంత స్పెషల్..?
Also Read
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
- Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
- Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
హుస్సెనాబాద్ పీఎస్ పరిధిలోని పాలమూలో ఈ ఘటన జరిగింది. గురువారం అర్థరాత్రి ఒంటరిగా ఉన్న బాలికపై కన్నేసిన ఆరుగురు నిందితులు బలవంతంగా కిడ్నాప్ చేశారు. ఆ సమయంలో బాలిక తల్లిదండ్రులు పెళ్లికి వెళ్లడంతో బాలిక ఇంట్లోనే ఒంటరిగా ఉంది. గ్రామ శివారుకు తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితులంతా అదే గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. నిందితులు ఈ మొత్తం అఘాయిత్యాన్ని వీడియో తీసి ఎవరికైనా చెబితే వైరల్ చేస్తామని బెదిరించారు.
శుక్రవారం తల్లిదండ్రులు ఇంటికి తిరిగి రాగానే, జరిగిన ఘటన గురించి బాలిక వారికి తెలియజేసింది. గ్రామస్తుల సహాయంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. అత్యాచారానికి పాల్పడిన నిందితులంతా బాధితురాలి ఇంటి చుట్టుపక్కల నివాసం ఉంటున్నారు. నిందితులను నితీష్ కుమార్ ఠాకూర్, సచిన్ ఠాకూర్, రాజు ఠాకూర్, రోహిత్ ఠాకూర్, సచిన్ ఠాకూర్ అలియాస్ మజిలా, దినేష్ ఠాకూర్‌లగా పోలీసులు గుర్తించారు. ఈ కేసులో గ్రామస్తులు నిందితుల్లో ఒకరిని పట్టుకోగా.. మిగతా ఐదుగురు పరారయ్యారు. వీరికోసం పోలీసులు వేట సాగిస్తున్నారు. నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. బాధితురాలని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!