వైద్యం వికటించి ఐదు నెలల గర్భిణీ మృతి

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణంలోని ప్రశాంతి ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శివాని అనే గర్భిణీని వైద్యం కోసం చౌటుప్పల్‌లోని ప్రశాంతి ప్రైవేటు ఆసుప్రతికి కుటుంబ సభ్యలు తీసుకువచ్చారు. అయితే వైద్యం వికటించి ఐదు నెలల గర్భిణీ శివాని మృతి చెందింది.

దీంతో వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ.. ఆస్పత్రి ముందు మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. ఆగ్రహంతో ఆసుపత్రి ఫర్నీచర్ ధ్వంసం చేసారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Related Articles

Latest Articles