పంజాబ్‌లోని లుథియానాలో దారుణం వెలుగు చూసింది. చేతబడి అనుమానంతో 70 ఏళ్ల వృద్ధురాలిని 22 ఏళ్ల యువకుడు కత్తితో పొడిచి హత్య చేశాడు. వివరాల్లోకి వెళ్తే… లుథియానా శివారులోని మెహర్బన్ ప్రాంత పరిధిలోని చుహర్వాల్ గ్రామంలో ఈనెల 18న రాత్రి కౌర్ అనే వృద్ధురాలితో తల్లి, కొడుకులు ఘర్షణ పడ్డారు. ఈ నేపథ్యంలో కౌర్ ప్రార్థనల కోసం గురుద్వారాకు వెళ్తుండగా ఆ ప్రాంతంలో మాటువేసిన యువకుడు ఆమెపై కత్తితో దాడి చేశాడు. కౌర్ చేతబడి చేస్తుందన్న ఆరోపణలతో ఆరుసార్లు కత్తితో పొడిచి పరారయ్యాడు.
Read Also: మ్యారేజ్ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్రం
ఈ ఘటనలో వృద్ధురాలు కౌర్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. ఈ హత్యపై మృతురాలి కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితుడిని, హత్యకు కుట్ర పన్నిన అతడి తల్లిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా నిందితుడు జస్పాల్ సింగ్ అని పోలీసులు వెల్లడించారు. కౌర్ హత్య ఘటనపై తాము విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
