NTV Telugu Site icon

6 Minors Stab Man: హార్న్ వివాదం.. బైక్‌ను వెంబడించి, కత్తితో పొడిచి..

Minors Stabbs A Man

Minors Stabbs A Man

6 Boys Chase Bike Stab Man On Busy Road In Madhya Pradesh: దారికి అడ్డంగా ఉన్నారని హార్న్ కొట్టాడు. కొంచెం పక్కకు తప్పుకోమ్మని కోరాడు. అంతే.. అవతలున్న మైనర్లు ఆ యువకుడితో వాగ్వాదానికి దిగారు. తమనే తప్పుకోమ్మని చెప్తావా? అంటూ దాడి చేశారు. వారి నుంచి ఆ యువకుడు పారిపోవడానికి ప్రయత్నించగా.. వెంబడించి మరీ రద్దీగా ఉన్న రహదారిలోనే కత్తితో పొడిచారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో డిసెంబర్ 31వ తేదీన చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..

Daughter Killed Mother: మధ్యప్రదేశ్‌లో దారుణం.. ప్రేమ మాయలో పడి కన్నతల్లినే..

కొత్త సంవత్సరం రోజున స్నేహితులతో కాస్త సరదాగా తిరుగుదామని.. ఆయుష్ (22) అనే యువకుడు తన ఇద్దరు స్నేహితులతో కలిసి బైక్‌పై బయటకు వచ్చాడు. ఈ క్రమంలోనే భన్వర్ కౌన్ అనే ప్రాంతంలో కొంతమంది అబ్బాయి రోడ్డుపై నిలబడి, రాకపోకలకు అంతరాయం కలిగిస్తున్నారు. దీంతో ఆయుష్ హార్న్ కొట్టి, వాహనాలను వెళ్లేందుకు దారి ఇవ్వాలని కోరాడు. అప్పుడు ఆ కుర్ర గ్యాంగ్ రెచ్చిపోయింది. దారి ఇచ్చేదే లేదంటూ ఆయుష్‌తో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఆ కుర్రాళ్లకి, ఆయుష్‌కి మధ్య గొడవ జరిగింది. చివరికి ఆయుష్ న్యూ ఇయర్ రోజు రచ్చ ఎందుకులే అనుకొని, తన స్నేహితులతో కలిసి బైక్‌పై అక్కడి నుంచి బయలుదేరాడు.

Instagram Job Fraud: ఆన్‌లైన్‌ మోసం.. ఉద్యోగం పేరుతో యువతికి టోకరా

అయితే.. ఆ కుర్ర గ్యాంగ్ మాత్రం వెనక్కు తగ్గలేదు. ఆయుష్‌కి గుణపాఠం చెప్పాలనుకొని, అతడి బైక్‌ని వెంబడించారు. ఈసారి ఆయుష్ బైక్ నడపకుండా వెనుక కూర్చున్నాడు. దాంతో ఆ కుర్ర గ్యాంగ్ వెంబడించి, వెనుక నుంచి ఆయుష్‌పై కత్తితో ఎటాక్ చేశారు. తర్వాత అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటన తర్వాత ఆయుష్‌ని ఆసుపత్రికి తరలించారు. కానీ ఫలితం లేకుండా పోయింది. అతడు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆరుగురు మైనర్లను అరెస్ట్ చేశారు. ఇందులో తొమ్మిదో తరగతి చదివే ఇద్దరు మైనర్లున్నారు. ఈ ఘటనకి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.

Show comments