Site icon NTV Telugu

35 ఏళ్ల మహిళతో 14 ఏళ్ల బాలుడి రాసలీలలు.. చివరికి

వివాహేతర సంబంధాలకు వావి వరుసలు ఉండవు.. చిన్నా, పెద్ద తేడా ఉండదు. కామంతో కళ్లు మూసుకుపోయినవారికి అస్సలు విచక్షణే ఉండదు. తాజగా ఒక 35 ఏళ్ల మహిళ.. ఓ 14 ఏళ్ల బాలుడితో శారీరక సంబంధం పెట్టుకొంది. ఆ విషయం ఇంట్లో తెలిసేసరికి ఇద్దరు కలిసి ఇంట్లోంచి పారిపోయిన ఘటన తమిళనాడులో వెలుగుచూసింది.

వివరాల్లోకి వెళితే.. తిరువారూర్ జిల్లాలోని కూడవాసల్ తాలూకాలో బాలగురు, రసతి అనే దంపతులు నివాసం ఉంటున్నారు. వారికి 13 ఏళ్ల కూతురు, 14 ఏళ్ల కొడుకు ఉన్నారు. కొడుకు పదో తరగతి చదువుతున్నాడు. అయితే అదే ప్రాంతానికి చెందిన లలిత(35) అంగన్ వాడీ కేంద్రంలో వంట మనిషిగా పనిచేస్తోంది. ఇద్దరు ఇళ్లు కొద్దిగా దగ్గరలోనే ఉండడంతో రోజు వీరిద్దరూ కలిసివెళ్ళేవారు. వీరిద్దరి మధ్య వయస్సు ఎక్కువ కావడంతో చుట్టుపక్కలవారు కూడా వీరిని అనుమానించలేదు. ఇక వీరిద్దరి పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. ఎవరు లేని సమయంలో బాలుడిని అంగన్ వాడీ కేంద్రానికి పిలిపించుకొని అతడితో రాసలీలలు నడిపేది.

ఇలా కొద్దిరోజులు బాగానే సాగిన ఒక రోజు వీరిద్దరిని బాలుడు తల్లిదండ్రులు చూసారు. దీంతో వెంటనే లలితను నుంచి బాలుడిని విడదీయడానికి బాలుడి అత్త వాళ్లింట్లో ఉంచి, అక్కడి నుంచి స్కూల్‌కు వెళ్లి, అత్త ఇంట్లోనే ఉండాలని తల్లిదండ్రులు చెప్పారు. అక్కడినుంచి స్కూల్ కి వెళ్తున్న బాలుడు ఈ నెల 26 నుంచి కనిపించకుండా పోయాడు. కొడుకు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు. ఎవరిపైనైనా అనుమానం ఉందా అని అడగడంతో లలిత గురించి చెప్పారు. దీంతో లలితను విచారించడానికి వెళ్లగా ఆమె కూడా కనిపించడం లేదని తెలిసి పోలీసులు షాక్ అయ్యారు. ఇద్దరు కలిసే పారిపోయారని పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Exit mobile version