NTV Telugu Site icon

Mumbai: ముంబైలో ఘోరం.. 3 ఏళ్ల చిన్నారిపై 9వ తరగతి విద్యార్థి అఘాయిత్యం

3yearoldgirlrapedmumbai

3yearoldgirlrapedmumbai

ఆర్థిక రాజధాని ముంబైలో ఘోరం జరిగింది. సకినాకా ప్రాంతంలో మూడేళ్ల చిన్నారిపై 9వ తరగతి విద్యార్థి అత్యాచారానికి పాల్పడ్డాడు. చిన్నారి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో మైనర్ నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం నిందితుడిని కోర్టులో హాజరుపరిచినట్లు పోలీసులు తెలిపారు.

ఇది కూడా చదవండి: Murder Case: ప్రియుడిని మర్డర్ చేయించిన ప్రియురాలు

దేశంలో రోజు రోజుకు నేరాలు-ఘోరాలు పెరిగిపోతున్నాయి. ఏదొక చోట.. ఎక్కడో చోట మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. అత్యంత దారుణంగా వైద్యురాలు హత్యకు గురైంది. ఈ ఘటన మరువక ముందే యూపీలో ఎస్పీ నేత బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇది కూడా చదవండి: Andhra Pradesh: వెయిటింగ్‌లో ఉన్న సీనియర్ ఐపీఎస్‌లకు బిగ్‌ షాక్.. డీజీపీ కీలక ఆదేశాలు

విద్యాబుద్ధులు నేర్చుకోవల్సిన వయసులో మైనర్లు చెడు వసనాలకు అలవాటు పడుతున్నారు. దీంతో తప్పుడు త్రోవలో వెళ్లి భవిష్యత్‌ను పాడు చేసుకుంటున్నారు. చిన్నారిపై అత్యాచారం చేసి తొమ్మిదో తరగతి విద్యార్థి జువైనల్ జైలుకెళ్లాడు. దీంతో భవిష్యత్ అంధకారంగా మారింది.

ఇది కూడా చదవండి: AAY : ఆయ్AAY : ఆయ్’ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో నిఖిల్

Show comments