Site icon NTV Telugu

10th Class Exam: పరీక్షలో ఆన్సర్స్ చూపించలేదని కత్తితో దాడి చేసిన విద్యార్థులు..

10th Exam

10th Exam

10th Class Exam: మహారాష్ట్రలో దారుణం జరిగింది. 10 తరగతి పరీక్షల్లో సహవిద్యార్థి ఆన్సర్స్ చూపించడం లేదని, ముగ్గురు విద్యార్థులు కత్తితో పొడిచారు. ఈ ఘటన రాష్ట్రంలోని థానే జిల్లా భివాండీ పట్టణంలో చోటు చేసుకుంది. పరీక్షలో ఆన్సర్ పేపర్ చూపించడం లేదని ముగ్గురు మైనర్ స్టూడెంట్స్ ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు గురువారం తెలిపారు. మంగళవారం పరీక్ష ముగిసిన తర్వాత ఈ ఘటన జరిగినట్లు వెల్లడించారు. గాయపడిన విద్యార్థిని స్థానిక ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు.

Read Also: Arvind Kejriwal: లిక్కర్ కేసులో నా పేరు లేదు.. ఇది రాజకీయ కుట్ర

ఎస్ఎస్‌సీ పరీక్షల్లో బాధిత విద్యార్థి, ఇతర విద్యార్థులకు సమాధానాలు చూపించడానికి నిరాకరించారు. దీంతో కోపం పెంచుకున్న ముగ్గురు విద్యార్థులు పరీక్ష హాల్ నుంచి బయటకు రాగానే సదరు విద్యార్థిని పట్టుకుని కొట్టారు, అతడిని కత్తితో పొడిచారు. దాడిలో గాయపడిన విద్యార్థిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం ప్రాణాపాయం లేకుండా విద్యార్థి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ముగ్గురు విద్యార్థులపై ఐపీసీ సెక్షన్ 324 ప్రకారం శాంతి నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.

Exit mobile version