Site icon NTV Telugu

Instagram: ఇన్‌స్టా గ్రామ్‌లో పరిచయం.. 20 రోజులు బంధించి యువతిపై లైంగిక దాడి..

Instagram Ford

Instagram Ford

Instagram: ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన యువతిని 20 రోజుల పాటు హోటల్‌ రూమ్ లో బంధించి లైగింక వేధింపులకు పాల్పడిన ఘటన హైదరాబాద్‌లో వెలుగు చూసింది. భైంసాకు ప్రాంతానికి చెందిన ఓ విద్యార్థినిని.. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన కృష్ణ చైతన్య ఇంస్టాగ్రామ్ లో ట్రాప్ చేశాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి, సదరు యువతిని హైదరాబాద్ నగరానికి వచ్చేలా చేశాడు. బాధిత యువతి నగరానికి చేరుకున్న అనంతరం నారాయణగూడ లోని ఓ హోటల్ కు తీసుకెళ్లి ఆమెను నిర్బంధించాడు. పెళ్లి పేరిట తన లైంగిక వాంఛ తీర్చుకున్నాడు. ఇలా 20 రోజులుగా పెళ్లిని దాటివేస్తూ యువతిని లైంగికంగా వేదించాడు. యువతికి తీవ్రంగా కడుపునొప్పి రావడంతో స్థానిక కింగ్ కోఠి ప్రభుత్వ హాస్పిటల్ కు తీసుకెళ్లి చికిత్స చేయించాడు. దీంతో యువతి పెళ్లి చేసుకోవాలని నిలదీసింది.

Read also: 54th GST Council Meeting: నేడు ఢిల్లీలో 54వ జీఎస్టి కౌన్సిల్ సమావేశం.. హాజరుకానున్న భట్టి విక్రమార్క

సరే చేసుకుంటా అని నమ్మించి మళ్లీ నారాయణగూడ హోటల్ రూమ్ కు తీసుకుని వచ్చాడు. ఆ యువతి రూమ్ లోపలికి వెళ్లగానే సదరు యువకుడు హోటల్ రూమ్ కు డోర్ లాక్ చేసి , అక్కడి నుండి పరారయ్యాడు. దీనితో బాధిత యువతి ఆమె తల్లిదండ్రులకు జరిగిన విషయం చెప్పి , లైవ్ లొకేషన్ ను పంపించింది. నగరానికి చేరుకున్న యువతి తల్లిదండ్రులు… షీ టీమ్స్ ను ఆశ్రయించారు. వెంటనే స్పందించిన షీ టీమ్స్ , నారాయణగూడ పోలీసుల సహకారంతో బాధిత యువతిని రెస్క్యూ చేశారు. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన నారాయణగూడ పోలీసులు యువకుడిని అరెస్ట్ చేశారు. యువకుడు హైదరాబాద్ బీటెక్ పూర్తి చేసి , సాఫ్ట్వేర్ కోర్స్ చేస్తున్నాడని , అతడిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు నారాయణగూడ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు.
Central Team: నేడు రాష్ట్రానికి కేంద్ర బృందం..

Exit mobile version