NTV Telugu Site icon

Delhi: 14 ఏళ్ల బాలికపై అత్యాచారం.. తల్లి “లివ్-ఇన్ పార్ట్‌నర్” అఘాయిత్యం..

Delhi Crime

Delhi Crime

Delhi: ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. 14 ఏళ్ల బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ అఘాయిత్యానికి పాల్పడింది బాలిక తల్లి ‘లివ్ ఇన్ పార్ట్‌నర్’ అని పోలీసులు బుధవారం తెలిపారు. ఉత్తర ఢిల్లీలోని బురారీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఘజియాబాద్ నివాసి అంకిత్ యాదవ్(29) అనే నిందితుడిని అరెస్ట్ చేసి జైలుకు పంపినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిపై భారతీయ శిక్షాస్మృతి (IPC)లోని సెక్షన్లు 376 (రేప్), మరియు 506 (క్రిమినల్ బెదిరింపు) మరియు లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (POCSO) చట్టంలోని నిబంధనల ప్రకారం బురారీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

Read Also: Meena : సినీ నటి మీనా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారా?

మహిళ 8 ఏళ్ల క్రితం తన భర్తను విడిచిపెట్టింది. ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. భర్తతో విడిపోయినప్పటి నుంచి బస్సు డ్రైవర్ అంకిత్ యాదవ్‌తో లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉందని పోలీసుల ఎఫ్ఐఆర్ తెలిపింది. ఈ అత్యాచార ఘటన జూలై 23న, బాలిక తల్లి తన పిల్లల్ని ఇంట్లో వదిలి బయటకు వెళ్లిన సమయంలో, నిందితుడు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఎవరికి చెప్పొద్దని బెదిరించాడు. గతంలో పలు సందర్భాల్లో ఇలాగే అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతని ఆగడాలు వెలుగులోకి వచ్చాయి.