Site icon NTV Telugu

కరోనాకు నాటు వైద్యం ఇప్పిస్తానని బాలికను తీసుకెళ్లి.. అలా చేసి

guntur

guntur

ఈ కాలంలో ఎవరిని నమ్మాలో.. ఎవరిని నమ్మకూడదో అర్ధం కావడంలేదు. సాయం చేస్తామని నమ్మించి స్వార్థంతో ప్రవర్తిస్తున్నారు. మాయమాటలు చెప్పి వారిని నట్టెట్ట ముంచుతున్నారు. తాజాగా ఓ మహిళ.. కరోనా బారిన పడి కోలుకున్న బాలికను మరోసారి కరోనా రాకుండా నాటు వైద్యం ఇప్పిస్తానని నమ్మబలికి బాలికను వ్యభిచార రొంపిలోకి దింపింది. ఈ దారుణ ఘటన గుంటూరు లో వెలుగుచూసింది.

వివరాల్లోకి వెళితే.. గుంటూరులోని రురల్ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి అపార్టుమెంట్ లో వాచ్ మెన్ గా పనిచేస్తున్నాడు. ఇటీవల అతడి భార్యకు, కూతురుకు కరోనా రాగా గుంటూరు జిజిహెచ్ లో జాయిన్ చేసారు. కరోనా దాటికి భార్య మృతి చెందగా.. బిడ్డ బతికి బట్టకట్టింది.. 13 ఏళ్ల బాలికకు నెగిటివ్ వచ్చినా.. కాస్త అనారోగ్యంతో ఇబ్బంది పడేది .. ఇక వీరి విషయం తెలుసుకున్న ఒక మహిళ తానూ ఆసుపత్రిలో నర్సునని బాలిక తండ్రికి పరిచయం చేసుకొంది. బిడ్డ త్వరగా కోలుకోవాలంటే నాటు వైద్యం చేయించాలని , తల్లి లేదుకాబట్టి తానే దగ్గర ఉంది చూసుకొంటానని నమ్మించి బాలికను తనతో పాటు తీసుకెళ్లి ఆమె కీచక బుద్ధి బయటపెట్టింది.. అనారోగ్యంతో ఉందని.. తల్లి లేని పిల్ల అని ఏ మాత్రం జాలి చూపించలేదు. కాసులపై కక్కుర్తితో వ్యభిచార రొంపిలోకి దింపింది.

తనకు ఇష్టం లేదని చెప్పిన బాలికను శారీరకంగా , మానసికంగా చిత్రహింసలు పెట్టి వ్యభిచారం చేయించింది. విజయవాడ , నెల్లూరు , చిత్తూరు లాంటి ప్రణతాలను తిప్పుతూ డబ్బులు పోగేసింది. ఇక ఇటీవల బాలిక ఆరోగ్యం పూర్తిగా పాడైపోవడంతో ఆమెను విజయవాడలో వదిలి వెళ్ళిపోయింది. ఇక ఇదే అదునుగా భావించిన బాలిక రెండు రోజుల క్రితం ఇంటికి చేరుకొని తండ్రికి జరిగింది వివరించింది. దీంతో తండ్రి, కూతురితో కలిసి పోలీసుఅల్ను ఆశ్రయించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Exit mobile version