10 Youngsters Killed Auto Driver In Chennai Over Honking: తమిళనాడులో దారుణం చోటు చేసుకుంది. హారన్ కొట్టిన పాపానికి పది మంది యువకులు కలిసి ఒక ఆటో డ్రైవర్‌ని హత్య చేశారు. అతడ్ని కాపాడబోయిన అతని సోదరుడ్ని సైతం చితకబాదారు. ఆ వివరాల్లోకి వెళ్తే.. చెన్నైలోని అంబత్తూర్ ప్రాంతంలో గురువారం రాత్రి 11:30 గంటల సమయంలో 10 మంది యువకులు తమ స్నేహితుడి పుట్టినరోజుని రోడ్డుపైనే జరుపుకుంటున్నారు. సరిగ్గా అదే సమయంలో ఒక ఆటో అటుగా వచ్చింది. ఆ ఆటోలో అంబత్తూరులోని వెంకటేశ్వర నగర్‌కు చెందిన కామేష్(25)తో పాటు అతని సోదరుడు సతీష్ (29) ఉన్నారు. తన సోదరుడ్ని ఒరగడమ్‌లో ఉన్న ఇంటి వద్ద దింపేందుకు కామేష్ వెళ్లాడు.
Teacher Harassment: యువతిపై మాష్టారు లైంగిక వేధింపులు.. గుడ్డలూడదీసి మరీ..
అయితే.. ఆ 10 మంది యువకులు రోడ్డుని నిర్బంధించి, బర్త్‌డే వేడుకలు జరుపుకుంటుండటంతో.. తమకు వెళ్లేందుకు దారి ఇవ్వమని కామేష్ రిక్వెస్ట్ చేశాడు. కానీ.. ఆ యువకులు వినలేదు. దారిచ్చేది లేదన్నట్టుగా వ్యవహరించారు. అప్పటికీ కొంత సమయం వేచి చూసిన కామేష్.. ఆపై హారన్ కొట్టడం మొదలుపెట్టాడు. అతడు గ్యాప్ ఇవ్వకుండా హారన్ కొడుతుండటంతో.. ఆ 10 మంది యువకులు కోపాద్రిక్తులై, అతనితో వాగ్వాదానికి దిగారు. కేక్ కట్ చేసేదాకా ఉండలేవా అంటూ కామేష్‌పై దాడి చేశారు. వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన సతీష్‌పై కూడా వాళ్లు ఎటాక్ చేశారు. బర్త్‌డే బాయ్ అయిన గౌతమ్.. కేక్ కట్ చేసే కత్తితో కామేష్‌పై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఆపై అక్కడి నుంచి వాళ్లందరూ పారిపోయారు.
Chain Snatching: చైన్ స్నాచింగ్ దొంగలు అరెస్ట్.. 16 తులాల బంగారం, రెండు బైక్‌లు, ఒక ఆటో..
సతీష్ స్థానికుల సహాయంతో తన సోదరుడ్ని ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అయితే.. అప్పటికే అతడు కత్తిపోట్ల గాయాల కారణంగా మరణించినట్టు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై సతీష్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వాళ్లు వెంటనే రంగంలోకి దిగారు. ఈ కేసులో నిందితులు గౌతమ్ (22), నవీన్ కుమార్ (18), అజయ్ (22), రియాజ్ (19), కతీర్‌సేన్, సూర్య (23)తో పాటు మరో ఇద్దరు మైనర్లు అరెస్ట్ చేశారు. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.