Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Kanabadutaledu Movie Review

రివ్యూ: కనబడుట లేదు

Published Date :August 19, 2021 , 4:13 pm
By ramakrishna
రివ్యూ: కనబడుట లేదు
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఈ మధ్య కాలంలో పరభాషల్లో తెరకెక్కిన క్రైమ్, థ్రిల్లర్స్ తెలుగులో తెగ డబ్బింగ్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా ఓటీటీలలో ఆ తరహా సినిమాలే ఎక్కువగా దర్శనమిస్తున్నాయి. డిటెక్టివ్ మూవీస్ సైతం ఇతర భాషల నుండే దిగుమతి అవుతున్న టైమ్ లో ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ మన నేటివిటీలో వచ్చి, మంచి విజయం సాధించింది. అదే కోవలో వచ్చిన మరో డిటెక్టివ్ మూవీనే ‘కనబడుట లేదు’. ఎం. బాలరాజును దర్శకుడిగా పరిచయం చేస్తూ సాగ‌ర్, స‌తీశ్ రాజు, దిలీప్, డా. శ్రీనివాస్ కిష‌న్, దేవీ ప్ర‌సాద్ నిర్మించిన ఈ సినిమా గురువారం విడుదలైంది.

శశి (వైశాలీ రాజ్), ఆదిత్య (యుగ్ రామ్) కొత్తగా పెళ్ళైన జంట. అయితే పెళ్ళికి ముందే శశి… సూర్య (సుక్రాంత్) అనే ఫుడ్ డెలీవరీ బోయ్ ను ప్రేమిస్తుంది. అనాథ అయిన సూర్యతో శశి పెళ్ళి చేయడానికి తండ్రి ఒప్పుకోడు. ఇద్దరూ కలిసి ఊరు వదిలి వెళ్ళిపోదాం అనుకుంటూ ఉండగా, సూర్య నుండి శశి ఫోన్ కి ఓ మెసేజ్ వస్తుంది. దాంతో ఆమె సూర్య మోసం చేశాడని భావించి, ఆదిత్యతో పెళ్ళికి ఒప్పుకుంటుంది. తనని మోసం చేసిన సూర్య మీద పగ తీర్చుకోవాలనే కోరికతో రగిలిపోయే వైశాలీ భర్తనే అందుకు ఆయుధంగా వాడుకుంటుంది. సూర్యను చంపేయమని కోరుతుంది. మరి ఆమె కోరిక మేరకు ఆదిత్య… సూర్యను చంపేశాడా? అసలు సూర్య బతికే ఉన్నాడా? సూర్య అర్థాంతరంగా శశి జీవితంలోంచి వెళ్ళిపోవడానికి కారణం ఏమిటీ? ఈ చిక్కు ముడులను డిటెక్టివ్ రామకృష్ణ (సునీల్) ఎలా విప్పాడు? అన్నదే ఈ చిత్ర కథ.

ఇలాంటి కథలకు చాలా హోమ్ వర్క్ చేయాలి. పైగా క్రైమ్ అండ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ అంటే బుర్రకు బాగా పనిచెప్పాలి. డైరెక్షన్ అండ్ రైటర్స్ టీమ్ ఆ విషయంలో బాగానే పనిచేసింది. కానీ కొన్ని అంశాలలో మాత్రం పెట్టాల్సినంత దృష్టి పెట్టలేదనీ తెలిసిపోతోంది. సూర్య తనని మోసం చేశాడని శశి భావించడం, చంపేయాలనేంత కసిని అతని మీద పెంచుకోవడానికి బలమైన కారణాలు మనకు కనిపించవు. సినిమా ప్రారంభంలోనే ఓ హత్యకు గురైన మృతదేహం దొరకడం, దాని గురించి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయడం, ఇంతలో పోలీస్ ఆఫీసరే హత్యకు గురికావడం, ఇవి చాలవన్నట్టు మరో మిస్సింగ్ కేసు… ఇవన్నీ ప్రేక్షకుల్ని కాస్తంత కన్ ఫ్యూజన్ కు గురిచేస్తాయి. ద్వితీయార్థంలో ఈ చిక్కు ముడులను సునీల్ పాత్ర ద్వారా విప్పే ప్రయత్నం చేసినా… అందులోనూ ఊహకందని ట్విస్టులను పెట్టారు. ఓ రకంగా ఇవన్నీ ప్రేక్షకులను ఆకట్టుకునేవే అయినా… మరింత స్మూత్ గా ఈ కథను డీల్ చేసి ఉండాల్సింది. సూర్యను రోజుల తరబడి బందీ చేయడం, అనాధ మహిళల్లో ఉండే సైకిక్ మెంటాలిటీ ఇలాంటివి గతంలో కొన్ని సినిమాలలో చూసినవే… వాటిని ఇంకొంచం కొత్తగా తీసి ఉండాల్సింది. ఇక పోలీస్ ఆఫీసర్ కిశోర్ కుమార్ పై చిత్రీకరించిన సన్నివేశాలు కొన్ని అతిగా ఉన్నాయి. సబార్డినేట్స్ పై అయిన దానికీ కాని దానికి అతను చెయ్యి చేసుకోవడం, విమనైజర్ గా అతన్ని చూపడం కాస్తంత చికాకు పెట్టే అంశాలే! వాటిని కాస్తంత తగ్గించి ఉండాల్సింది.

సూర్యగా సుక్రాంత్, శశిగా వైశాలీ రాజ్ చక్కగా నటించారు. వైశాలీ రాజ్ కు హోమ్లీ క్యారెక్టర్స్ మరిన్ని దక్కే ఆస్కారం ఉంది. డిఫరెంట్ మేనరిజమ్ తో ఆదిత్యగా యుగరాజ్ బాగానే చేశాడు. డిటెక్టివ్ రామకృష్ణ గా సునీల్ వచ్చేది ద్వితీయార్ధంలోనే అయినా… అక్కడి నుండి సినిమా మొత్తం అతని మీదగానే సాగుతుంది. అయితే… ఓ డిటెక్టివ్ గా సునీల్ చేసే పనులకంటే… కథను ప్రేక్షకులకు నేరెట్ చేస్తున్నాడా అన్నట్టుగానే అతని పాత్ర సాగింది. అతనికి, అతని అసిస్టెంట్ కు మధ్య ఉన్న ఒకటి రెండు సన్నివేశాలు ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ను గుర్తు చేశాయి. ఈ సినిమాలో బిగ్ బాస్ ఫేమ్ హిమజా కీలక పాత్ర పోషించింది. అంతేకాదు.. తన నటనతో ఆకట్టుకుంది కూడా! ఇక ఇతర ప్రధాన పాత్రలను కిశోర్ కుమార్, కిరీటి దామరాజు, రవివర్మ, ప్రవీణ్, ‘కేరాఫ్ కంచరపాలెం’ సుబ్బారావు తదితరులు పోషించారు. వీరి నుండి దర్శకుడు బాలరాజు చక్కని నటన రాబట్టుకున్నాడు. మధు పొన్నాస్ నేపథ్య సంగీతం, సందీప్ సినిమాటోగ్రఫీ బాగున్నాయి. ఏదేమైనా… ఇలాంటి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ ను సాగతీయకుండా, క్రిస్ప్ గా తీస్తేనే జనం మెచ్చే ఆస్కారం ఉంటుంది. కానీ అది ఈ సినిమా విషయంలో జరగలేదు. అందువల్ల ప్రేక్షకాదరణ ఈ చిత్రానికి ఎంతవరకూ కనబడుతుందనేది సందేహమే!

ప్లస్ పాయింట్స్

  • సునీల్ నటన
  • సాంకేతిక విలువలు
  • ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ కావడం

మైనెస్ పాయింట్స్

  • నిదానంగా సాగే ప్రథమార్ధం
  • క్యారెక్టరైజేషన్ లో లేని క్లారిటీ

ట్యాగ్ లైన్: డిటెక్టివ్ సునీల్!

రేటింగ్ : 2.5 / 5

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Himaja
  • Kanabadutaledu
  • Kanabadutaledu Movie Review
  • Kanabadutaledu Review
  • Sukranth Veerella

తాజావార్తలు

  • GT vs RR: ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం..

  • Off The Record : ప్రేమ్ సాగర్ రావులో నిరాశ, నిస్పృహలు పెరిగిపోతున్నాయా?

  • Off The Record: ఇంచార్జ్ కోసం పి.గన్నవరం టీడీపీ కేడర్ ఎదురు చూపులు

  • Instagram Love Tragedy: యువతి ప్రాణం తీసిన ఇన్‌స్టా లవ్‌.. ఎలుకల మందు తాగి..!

  • Off The Record: జనసేన కోసం రంగంలోకి ఐప్యాక్ మాజీ టీం..

ట్రెండింగ్‌

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions