NTV Telugu Site icon

Review: గెహ్రాయియా(అమెజాన్ ప్రైమ్)

gehraiyaan

gehraiyaan

జానర్ : రొమాంటిక్ డ్రామా
నటీనటులు: దీపికా పడుకోణె, అనన్య పాండే, సిద్ధాంత్ చతుర్వేది, ధైర్య కర్వా, నజీరుద్దీన్ షా, రజత్ కపూర్, విహాన్ చౌదరి, పవ్లీన్ గుజ్రాల్, దీపక్ కృపలానీ
దర్శకత్వం: శకున్ బాత్రా
నిర్మాతలు: కరణ్ జోహార్, హీరూ యశ్ జోహార్, అపూర్వ మెహతా, శకున్ బాత్రా
సినిమాటోగ్రఫి: కౌశల్ షా
సంగీతం: కబీర్ కతపలియా, సవేర్ మెహతా

‘గెహ్రాయియా’ అంటే లోతులు అని అర్థం. కథ కూడా ప్రేక్షకులను లోతులకు తీసుకు వెళ్తుంది కానీ, సహనాన్ని పరీక్షిస్తుంది. ఇక అసలు కథలోకి వెళ్తే, అలిషా అనే యోగా ఇన్‌ స్ట్రక్టర్ తన యాప్ ద్వారా క్లాసులు తీసుకుంటూ ఉంటుంది. ఆమె బాయ్ ఫ్రెండ్ కరణ్ రచయితగా తంటాలు పడుతూ ఉంటాడు. అతనికి సరైన ఉద్యోగం లేనందున అన్నాళ్లూ కలసి ఉన్నా, కరణ్ పై అలిషాకు మెల్లగా ఏహ్యభావం కలుగుతూ ఉంటుంది. తన యోగాను ఎలాగైనా ప్రమోట్ చేసుకోవాలి అనుకుంటున్న సమయంలో అలిషా కజిన్ టియా, ఆమె కాబోయే భర్త జియాన్ కనిపిస్తారు. అలిషా యాప్ ను తాను ప్రమోట్ చేస్తానంటాడు జియాన్. ఆమె అతనికి ఆకర్షితురాలవుతుంది. మరోవైపు కరణ్, అలిషాను పెళ్ళాడతానని అంటాడు. మళ్ళీ కరణ్ వైపు అలిషా మనసు మళ్ళుతుంది. అయితే కరణ్ మళ్ళీ నిరుద్యోగంతో తంటాలు పడడం ఆమెకు నచ్చదు. రెండు నెలలు టియా అమెరికావెళ్తుంది. ఆ సమయంలో అలిషా, జియాన్ మరింత దగ్గరవుతారు. టియా, కరణ్ కూడా ఎంతో క్లోజ్ గా ఉంటారు. ఒకరికొకరు తమ బాధలు వ్యక్తం చేసుకుంటూ ఉంటారు. జియాన్, టియాకు దూరం కావాలనుకుంటాడు.

అదే సమయంలో జియాన్ వ్యాపారం దెబ్బ తింటుంది. టియా తనకు తండ్రి ఇచ్చిన బంగ్లా అమ్ముకొని బిజినెస్ సెట్ చేసుకోమని సైన్ చేసి ఇస్తుంది. దాంతో అలిషానే వదిలించుకోవాలని ఆమెను చంపే ప్రయత్నం చేస్తాడు జియాన్. ఆ పెనుగులాటలో అతనే సముద్రంలో పడతాడు జియాన్ భాగస్వామికి అలిషాతో అతని అనుబంధం తెలుసు. అందువల్ల అలిషాను బ్లాక్ మెయిల్ చేస్తాడు. ఆమె జియాన్ వద్ద నుండి తీసుకున్న పేపర్స్ తెచ్చిస్తుంది. దాంతో జియాన్ ది ఆత్మహత్య అన్నట్టు చిత్రీకరిస్తారు. అలిషా వెళ్ళి టియాను ఓదారుస్తుంది. ఆ సమయంలో అలిషా తల్లికి, టియా తండ్రితో ఉన్న సంబంధం గురించి చెబుతుంది టియా. నిజానికి జియాన్ కు రాసిచ్చిన ఇల్లు టియా తండ్రి అలిషా పేరునే రాశాడన్న నిజం చెబుతుంది.

తరువాత రెండేళ్ళకు కరణ్ మంచి రచయిత అయివుంటాడు. తనతో కలసి పనిచేసే మరో రైటర్ ను పెళ్ళాడుతున్నట్టు చెబుతాడు. ఆ వేడుకలో అలిషా, టియా కలుసుకుంటారు. రెండేళ్ళ వరకు తమ మధ్య మాటలు లేనందుకు ఒకరికొకరు సారీ చెప్పుకుంటారు. అదే సమయంలో కరణ్ వచ్చి తన కాబోయే భార్య అమ్మమ్మ అంటూ ఓ ముసలావిడను పరిచయం చేస్తాడు. ఒకప్పుడు ఆమెకు, ఆమె భర్తకు తమ బోట్ లో చోటు ఇచ్చి ఉంటారు అలిషా, జియాన్. దాంతో ఆమె అలిషాను చూడగానే ‘నువ్వు అలిషా కదా…’ అని ప్రశ్నిస్తుంది. పాలిపోయిన ముఖంతో ఆమెను అలిషా చూస్తూండగా కథ ముగుస్తుంది.

ఈ సినిమా నిండా విలాసవంతమైన జీవితాలు కనిపిస్తాయి. నవతరం భావాలకు అనుగుణంగా తెరకెక్కించినట్టు అనిపిస్తుంది. అలిషాగా దీపిక పడుకోణె అందరినీ డామినేట్ చేసింది. ఇంటిమసీ సీన్స్ లో పెళ్ళయినా ఇంకా తాను తగ్గలేదంటూ దీపిక భలేగా నటించింది. ఆమె తరువాత టియా పాత్రలో అనన్య అందం కుర్రకారుకు మరింత బంధం వేస్తుంది. సిద్ధాంత్, ధైర్య కర్వా తమ పాత్రలకు తగ్గ నటన ప్రదర్శించారు. ‘దిల్ చాహ్ తా హై, జిందగీ న మిలేగి దుబారా’ చిత్రాల తరువాత హిందీ చిత్రాలలో లగ్జరీ లైఫ్ లోని సరదాలు, పర్యవసనాలు చూపించడం ఎక్కువైంది. కానీ, ఆ రెండు సినిమాల్లో ఉన్న ఆత్మ ఇందులో లేదనే చెప్పాలి.

ప్లస్ పాయింట్స్:

మైనస్ పాయింట్స్:

రేటింగ్: 2/5

ట్యాగ్ లైన్: ‘గెహ్రాయియా’… ‘నస’నేనయా