Telugu News
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • బిగ్ బాస్ తెలుగు 6
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • దిన ఫలాలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • Union Budget 2023
  • IT Layoffs
  • Pathaan
  • IPL 2023
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
Home Cinema Reviews Anukoni Athidhi Movie Review

రివ్యూ : అనుకోని అతిథి (మలయాళ డబ్బింగ్)

Published Date :May 28, 2021 , 1:21 pm
By Prakash
రివ్యూ : అనుకోని అతిథి (మలయాళ డబ్బింగ్)

గత యేడాది నవంబర్ లో కన్నడ చిత్రం ‘కారాళరాత్రి’కి తెలుగు రీమేక్ అయిన ‘అనగనగా ఓ అతిథి’ ఆహాలో స్ట్రీమింగ్ అయ్యింది. ఈ మర్డర్ మిస్టరీని ఇంకా జనం మర్చిపోకముందే… తాజాగా ఆహాలోనే మలయాళ చిత్రం ‘అథిరన్’ను ‘అనుకోని అతిథి’గా డబ్ చేసి ఈ శుక్రవారం స్ట్రీమింగ్ చేశారు. ఫహద్ ఫాజిల్, సాయిపల్లవి, అతుల్ కులకర్ణి ప్రధాన పాత్రలు పోషించిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ ఎలా ఉందో తెలుసుకుందాం.

ఇది 1972లో జరిగే కథ. దానికి ఐదేళ్ళ ముందు చల్లపల్లి సంస్థానంలోని రాజకుటుంబంలో నాలుగు హత్యలు జరుగుతాయి. ఆ సంస్థానపు వారసురాలు నిత్య (సాయిపల్లవి) ఆటిజమ్ తో బాధపడుతుంది. ఆ హత్యలు ఆమే చేసిందని అంతా భావిస్తుంటారు. కేరళలోని ఓ మారుమూల గ్రామంలో మానసిక వైద్యశాలలో గోవాకు చెందిన డాక్టర్ బెంజిమిన్ (అతుల్ కులకర్ణి) పనిచేస్తుంటాడు. నిత్య తన కూతురే అని ఆయన అక్కడి వాళ్ళకు చెబుతుంటాడు. అయితే… ఆ మానసిక వైద్యశాలలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయనే అనుమానంతో తిరువనంతపురం నుండి ప్రభుత్వం డాకర్ట్ నంద అనే సైకియాట్రిస్టు (ఫహద్ ఫాజిల్)ను అక్కడికి పంపుతుంది. అతని పరిశోధనలో ఏం తేలింది? తన కుటుంబ సభ్యులను నిత్యే చంపిందా? నిజంగానే ఆ మానసిక వైద్యశాలలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయా? అనేది ఈ చిత్ర కథ.

2019లో మలయాళ చిత్రం ‘అథిరన్’ విడుదలైంది. దానికి మిశ్రమ స్పందన లభించింది. 2014లో వచ్చిన ఓ అమెరికన్ మూవీ దీనికి ఆధారం. ఈ తరహా సైకిలాజికల్ థ్రిల్లర్స్ గతంలో చాలానే వచ్చాయి. అయితే దర్శకుడు వివేక్ ఆసక్తికరంగానే ఈ కథను నడిపించాడు. కేరళ అందాలతో పాటు… పురాతన భవంతి, అక్కడి సెలయేర్లు, పచ్చటి బయళ్ళు… సినిమా చూస్తున్న ప్రేక్షకులకు ఆహ్లాదాన్ని పంచుతాయి. సినిమా ప్రారంభం నుండి చివరి వరకూ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో చకచకా సాగిపోతుంది. ఇక నటీనటులు సైతం అనుభవం ఉన్నవాళ్ళు కావడంతో ఆ యా పాత్రల్లో చక్కగా ఒదిగిపోయారు. మరీ ముఖ్యంగా డాక్టర్ నంద పాత్రలో ఫహద్ ఫాజిల్, ఆటిజమ్ పేషెంట్, కలరీ యుద్ధ నిపుణురాలిగా సాయి పల్లవి… ఇద్దరూ పోటీపడి నటించారు. సాయిపల్లవి పాత్రకైతే సంభాషణలు దాదాపు లేవనే చెప్పాలి. ఇక అతుల్ కులకర్ణి డాక్టర్ బెంజిమెన్ పాత్రను హుందాగా పోషించాడు. జాతీయ ఉత్తమ నటుడు ప్రకాశ్ రాజ్ మూవీ చివరిలో అతిథి పాత్రలో మెరిశాడు. ఇతర ప్రధాన పాత్రలు పోషించిన వాళ్ళు… మనకు పరిచయస్థులు కాకపోయినా… అలా అనిపించదు. ఎందుకంటే అక్కడ పాత్రలే మనకు కనిపిస్తాయి. లీనా, సుదేవ్ నాయర్, రెంజీ ఫణిక్కర్, శాంతికృష్ణ, నందు, సురభి లక్ష్మి, విజయ్ మీనన్ ఆయా పాత్రలో చక్కగా ఒదిగిపోయారు.

ఓవర్ ఆల్ గా సినిమాను చూసినప్పుడు కొన్ని లూజ్ ఎండ్స్ కనిపిస్తాయి. హీరోయిన్ మేనత్త ఎలా మరణించిందో దర్శకుడు మనకు చూపడు. అలానే సంస్థానంలోని అన్నదమ్ముల మధ్య పగ, ప్రతీకారాలకు బలమైన కారణాలూ చెప్పడు. కొన్ని పాత్రలు తెర మీదకు ఎందుకు వచ్చి, ఎందుకు నిష్క్రమిస్తాయో అర్థం కాదు. పని కట్టుకుని ఆ గ్రామానికి పేపర్ తెప్పించుకునే డాక్టర్ బెంజిమన్ దానిని చదవకపోవడం కూడా దర్శకుడు చేసిన పొరపాటుగానే భావించాలి. అయితే… డాక్టర్ నంద జరిపే ఇన్వెస్టిగేషన్ లో లీనమైపోయిన వీక్షకుడికి ఇవేవీ పెద్దంత పట్టవు. అందుకు జిబ్రాన్ నేపథ్య సంగీతంతో పాటు, అను మోతేదత్ సినిమాటోగ్రఫీ కూడా ఉపయోగపడింది. ఇక జయహరి స్వరపరిచిన స్వరాలు, వాటికి చరణ్‌ అర్జున్‌, మధు పమిడికాల్వ సమకూర్చిన సాహిత్యం అర్థవంతంగా ఉన్నాయి. అయూబ్ ఖాన్ ఎడిటింగ్ కూడా బాగుంది. ఎం. రాజశేఖర్ రెడ్డి రాసిన మాటలు చక్కగా ఉన్నాయి.

నిజానికి అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే ‘అనుకోని అతిథి’ గత యేడాది నవంబర్ లో విడుదల కావాల్సి ఉంది. కానీ అలా జరగలేదు. చివరకు ఆహా ఓటీటీలో దీనిని స్ట్రీమింగ్ చేయడానికి నిర్మాత అన్నంరెడ్డి కృష్ణకుమార్ సిద్ధపడ్డారు. కానీ బాధాకరం ఏమంటే… ఇటీవలే ఆయన వైజాగ్ లో గుండెపోటుతో కన్నుమూశారు. గతంలో హీరో తరుణ్ తో కృష్ణకుమార్ ‘సఖియా’ అనే సినిమాను ప్రొడ్యూస్ చేశారు. బహుశా ఆ అనుబంధంతోనే కావచ్చు… ఇందులోని ఫహద్ ఫాజిల్ కు తరుణ్ తోనే డబ్బింగ్ చెప్పించారు. నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి కానీ రెండు మూడు చోట్ల మనకు మలయాళ రాత కనిపిస్తుంది. వాటిని పరిహరించి ఉంటే బాగుండేది.

ఓటీటీల పుణ్యమా అని ఇప్పుడు మలయాళ సినిమాల డబ్బింగ్ వర్షన్స్ ను మనం బాగానే చూడగలుగుతున్నాం. ఇక కొన్ని సినిమాలు తెలుగులోనూ రీమేక్ అవుతున్నాయి. వాళ్ళు ఎంచుకునే కథల్లోని కొత్తదనం మన వాళ్ళను ఆకట్టుకుంటోందని, ఆ చిత్రాలకు లభిస్తున్న ఆదరణ బట్టి అర్థమౌతోంది. థ్రిల్లర్ జోనర్స్ ను ఇష్టపడే వారికి ఈ మూవీ నచ్చుతుంది. ‘అనుకోని అతిథి’ టైటిల్ కు ట్యాగ్ లైన్ గా ‘అంతకు మించి’ అని పెట్టారు… అదేమిటో సినిమా చివరి వరకూ చూస్తే మీకే అర్థమౌతుంది.

రేటింగ్: 2.25 / 5

ప్లస్ పాయింట్స్
ఫహద్, సాయిపల్లవి నటన
అనుమోతేదత్ సినిమాటోగ్రఫీ
జిబ్రాన్ నేపథ్య సంగీతం

మైనస్ పాయింట్స్
ఆసక్తి కలిగించని కథనం
రొటీన్ క్లయిమాక్స్ ట్విస్ట్

ట్యాగ్ లైన్: ఈ అతిథి వైపు ఓ లుక్కేయొచ్చు!

ntv google news
  • Tags
  • Anukoni Athidhi
  • Anukoni Athidhi Review
  • Fahadh Faasil

WEB STORIES

అలర్ట్‌.. గూగుల్‌ క్రోమ్‌ అప్డేట్‌ చేసుకోండి.. లేకుంటే మీకే నష్టం..

"అలర్ట్‌.. గూగుల్‌ క్రోమ్‌ అప్డేట్‌ చేసుకోండి.. లేకుంటే మీకే నష్టం.."

పెళ్లి చేసుకొని మెగా ఇంటికి  దూరం కానున్న వరుణ్ తేజ్..?

"పెళ్లి చేసుకొని మెగా ఇంటికి దూరం కానున్న వరుణ్ తేజ్..?"

Amrit Udyan: అమృత్ ఉద్యాన్ అందాలు అదరహో..

"Amrit Udyan: అమృత్ ఉద్యాన్ అందాలు అదరహో.."

TarakaRatna: నందమూరి తారకరత్న విలన్ గా నటించిన సినిమాలు ఏంటో తెలుసా..?

"TarakaRatna: నందమూరి తారకరత్న విలన్ గా నటించిన సినిమాలు ఏంటో తెలుసా..?"

Cheese: జున్నుతో ఎన్నో లాభాలు.. రోజూ ఒక ముక్క తింటే..

"Cheese: జున్నుతో ఎన్నో లాభాలు.. రోజూ ఒక ముక్క తింటే.."

Budget 2023:  కేంద్ర బడ్జెట్ ఎలా తయారు చేస్తారో తెలుసా?

"Budget 2023: కేంద్ర బడ్జెట్ ఎలా తయారు చేస్తారో తెలుసా?"

Newborn Baby: తరుచూ ముద్దులు పెడితే ఏమవుతుందో తెలుసా..

"Newborn Baby: తరుచూ ముద్దులు పెడితే ఏమవుతుందో తెలుసా.."

Sweet Potatoes: దీని దుంపతెగ.. చిలగడదుంపతో జాగ్రత్త సుమా..!

"Sweet Potatoes: దీని దుంపతెగ.. చిలగడదుంపతో జాగ్రత్త సుమా..!"

Peas: శనగలతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు.. రోజూ విడిచిపెట్టరు

"Peas: శనగలతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు.. రోజూ విడిచిపెట్టరు"

Fenugreek: దానికి అలవాటు పడ్డారా? అయితే మెంతులు..

"Fenugreek: దానికి అలవాటు పడ్డారా? అయితే మెంతులు.."

RELATED ARTICLES

Dhoomam: ‘కెజిఎఫ్’ బ్యానర్ లో ‘పుష్ప’ విలన్..

Fahadh Faasil: 73 ఏళ్ళ వయస్సులో ఆ పరీక్షలు.. ఫహాద్ రీల్ తల్లి సాహసం

Top Gare: ఆ వివాదంలో ‘పుష్ప’ విలన్..

Manoj Bajpayee: ‘ఎక్కడ్నుంచి పట్టుకొస్తార్రా’ అంటూ ‘పుష్ప-2’పై బాంబ్

Fahadh Faasil: పుష్ప రెండో పార్ట్‌తో ఆగేది కాదు.. మూడోదీ ఉంది!

తాజావార్తలు

  • Donald Trump: నేను అధికారంలో ఉంటే 24 గంటల్లో రష్యా,ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేవాడిని

  • Sajjala Ramakrishna Reddy: ఫోన్ ట్యాపింగ్ చంద్రబాబు స్కీం.. కోటంరెడ్డి లాంటివాళ్లు పాత్రధారులు

  • WPL 2023: విమెన్స్ ఐపీఎల్ ఆటగాళ్ల వేలం ఆరోజునే..!

  • Car on Fire: కదులుతున్న కారులో మంటలు.. దంపతులు ఇద్దరు సజీవదహనం

  • Today (02-02-23) Stock Market Roudup: అయినా.. మార్కెట్ మారలేదు

ట్రెండింగ్‌

  • Swiggy : 380 మంది ఉద్యోగులకు ఉద్వాసన.. మాంసం మార్కెట్‌ బంద్‌..

  • Instagram : ఇన్‌స్టాలో మరో కొత్త ఫీచర్‌.. “క్వైట్ మోడ్”

  • Bedwetting : ఇవి తినిపిస్తే పిల్లలు నిద్రలో పక్క తడిపే అలవాటు మానేస్తారు

  • LPG Subsidy: గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. సబ్సిడీ మరో ఏడాది పొడగింపు?

  • Bhogi Festival: భోగి నాడు పిల్లలపై రేగిపళ్లను మాత్రమే ఎందుకు పోస్తారు?

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions