Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story 1997 Telugu Movie Review

రివ్యూ: 1997

Published Date :November 26, 2021 , 9:43 am
By Prakash
రివ్యూ: 1997
  • Follow Us :
  • google news
  • dailyhunt

సినిమా నిర్మాణమంటే కోట్లతో కూడిన వ్యవహారం. అందువల్ల పెట్టిన పెట్టుబడి తిరిగి రావడం కోసం ఎలాంటి కమర్షియల్ హంగులు జోడించాలా అని నిర్మాతలు ఆలోచిస్తుంటారు. అయితే అదే సినిమా ద్వారా సమాజానికి ఏదైనా ఓ మంచి చెప్పాలని తాపత్రయపడే దర్శక నిర్మాతలూ కొందరుంటారు. మనసులో మెదిలిన భావాలను పదిమందికి అందించడమే వారి లక్ష్యంగా ఉంటుంది. అలా నిజాయితీతో చేసిన ప్రయత్నాలు ఎంతవరకూ ప్రేక్షకులను మెప్పిస్తాయనేది పక్కన పెడితే, మేకర్స్ కు ఓ తృప్తి అయితే ఖచ్చితంగా లభిస్తుంది. అలాంటి పీరియాడిక్‌ మూవీనే ‘1997’.

ఊరిలోని దొర (రామరాజు) గారికి వంశపారంపర్యంగా వస్తున్న కులజాడ్యం బాగానే ఉంటుంది. గ్రామంలోని అట్టడుగు వర్గాలకు ఆలయ ప్రవేశానికి అవకాశం ఇవ్వడు కానీ తన కామదాహాన్ని చల్లార్చుకోవడానికి వారిని బాగానే ఉపయోగించుకుంటాడు. చిత్రం ఏమంటే ఆయన ప్రజాప్రతినిధి కూడా. దొరగారికి నక్సలైట్ల నుండి బెదిరింపులు ఉండటంతో ఆ ఊరికి ఏసీపీ విక్రమ్ రాథోడ్ ను (డా. మోహన్‌)ను పంపుతారు. అయితే ఛార్జ్ తీసుకున్న మర్నాడే గూడెంలో ఉండే గంగ, మంగ అనే అమ్మాయిలు తప్పిపోతారు. రెండు రోజులకు ఓ అమ్మాయి అత్యాచారానికి గురై, చెరువులో శవమై తేలుతుంది. మరో అమ్మాయి ఏమైంది? వాళ్ళను కిడ్నాప్ చేసింది ఎవరు? ఇందులో దొర హస్తం ఉందా? దొరను హత్య చేయాలనుకున్న నక్సలైట్లు ఆ పని చేశారా? కొత్తగా వచ్చిన ఏసీపీ గూడెం వారికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడా? అనేది మిగతా కథ.

దాదాపు పాతికేళ్ళ క్రితం జరిగిన కథగా దీన్ని దర్శకుడు మోహన్ చూపించాడు. అప్పటికీ ఇప్పటికీ అంటరాని తనం అనేది బాహాటంగా బయటకు కనిపించకపోయినా అగ్రవర్ణాల వ్యక్తుల మనసు లోతుల్లో బాగానే తిష్ఠవేసుకుని ఉంది. సమయం వచ్చినప్పుడు అది బయటపడుతూ ఉంటుంది. ఇందులో దర్శకుడు కొన్ని అంశాల గురించి తన మనసులో భావాలను చాలా స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేశాడు. అంటరాని వారంటూ దూరంగా పెట్టే వ్యక్తులను తమ కామదాహానికి ఉపయోగించుకునేప్పుడు అది ఎందుకు కనిపించదు? అంటే తమ అహంకారాన్ని ప్రదర్శించడానికి కులాన్ని అడ్డం పెట్టుకుంటారు తప్పితే మరొకటి కాదు. అలానే తప్పు అంటూ చేస్తే శిక్ష, కులం ఆధారంగా ఉండకూడదు. అట్టడుగు వర్గానికి చెందిన వారినైనా నిర్మొహమాటంగా శిక్షించాల్సిందే. ఆర్థికంగా ఎదిగినప్పుడే ఈ సమాజంలో వ్యక్తులకు గౌరవ మర్యాదలు దక్కుతాయి. అందుకోసం రిజర్వేషన్లు ఉపయోగపడతాయి. అదే సమయంలో అగ్రవర్ణాలలోని నిరుపేదలకూ రిజర్వేషన్లు వర్తింపచేయాలి. ఇలాంటి అంశాలను సూటిగానే చెప్పాడు. అయితే పోలీసులే చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడం, నక్సలైట్ల సాయం తీసుకోవడం అనేవి సబబుగా అనిపించవు. నేటి సమాజంలో ప్రజాస్వామ్యమనేది మేడిపండు అని మెజారిటీ జనాలు అంగీకరించేదే అయినా, ఆ వ్యవస్థను బలోపేతం చేసే పంథాలో ఆలోచించినప్పుడు, ఆ తరహాలో ప్రజలను మేల్కొలిపినప్పుడే మాత్రమే ఉత్తమ సమాజం ఏర్పడే ఆస్కారం ఉంటుంది. క్షణికావేశంతో అధికారులు తీసుకునే నిర్ణయాలకు కూడా ఎక్కడో చోట చెక్ పాయింట్ అనేది ఉండాలి. చాలామంది దర్శకులు, రచయితలు టేక్ ఇట్ గ్రాంట్‌ అన్నట్టుగా దాన్ని విస్మరిస్తుంటారు. ఇది సమంజసం కాదు. గతంలో చాలా సినిమాలలో తప్పు చేసిన అధికారులకూ, ప్రజా ప్రతినిధులకు శిక్ష పడినట్టు చూపిస్తే కానీ ‘శుభం’ కార్డు పడేది కాదు. ఇప్పుడు రోజులు మారిపోయాయి. తమ భావాలను తెర మీదకు బట్వాడా చేశామా లేదా అనే దర్శకులు చూస్తున్నారు.

నటీనటుల విషయానికి వస్తే వృత్తిరీత్యా డాక్టర్ అయిన మోహన్ తొలిసారి తానే కథానాయకుడిగా నటించడంతో పాటు దర్శక నిర్మాత బాధ్యతలను భుజానకెత్తుకున్నాడు. ఐపీఎస్ అధికారి విక్రమ్ రాథోడ్ గా బాగానే నటించాడు. ఇక సి.ఐ. చారి పాత్రలో ఎప్పటిలానే శ్రీకాంత్ అయ్యంగార్ స్టీల్ ది షో! విచారణాధికారిగా నవీన్ చంద్ర, దొరగా రామరాజు, ఎస్.ఐ. గా రవిప్రకాశ్‌ నటించారు. సంగీత దర్శకుడు కోటి ఈ సినిమాకు మ్యూజిక్ ఇవ్వడంతో పాటు డీజీపీగా స్పెషల్ అప్పీయరెన్స్ ఇచ్చారు. ఆయన అందించిన నేపథ్య సంగీతం మూవీకి హైలైట్ గా నిలిచింది. ఇందులో ఒకే ఒక పాట ఉంది. అదీ నేపథ్య గీతం. ‘ఏమి బతుకులు.. ఏమి బతుకులు’ అంటూ సాగే ఈ గీతాన్ని మంగ్లీ పాడింది. యూట్యూబ్ లో విశేష ఆదరణ పొందిన ఈ లిరికల్ వీడియోను సినిమాలోనూ అలానే వాడేశారు. రోలింగ్ టైటిల్స్ లో మోహన్ తో కలిసి ఈ పాటను రాసిన ఆదేశ్ రవి వాయిస్ తో మరోసారి ప్లే చేశారు. చిట్టిబాబు కెమెరాపనితం ఓకే. పరిమితమైన బడ్జెట్ తో మీనాక్షి రమావత్ నిర్మించిన ఈ సినిమా కథాంశం గొప్పది. అయితే ఎక్కువమందిని ఆకట్టుకునే అంశాలు ఇందులో తక్కువ. ప్రథమార్థం సాదాసీదాగా సాగినా, ద్వితీయార్థం, ముఖ్యంగా ముగింపు థ్రిల్లింగ్ గా అనిపిస్తుంది.

ప్లస్ పాయింట్స్
ఎంచుకున్న కథ
కోటి సంగీతం
పతాక సన్నివేశం

మైనెస్ పాయింట్స్
ప్రొడక్షన్ వాల్యూస్
నిదానంగా సాగే ప్రథమార్ధం

రేటింగ్: 2.5/ 5

ట్యాగ్ లైన్: వన్ మ్యాన్ షో!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 1997
  • 1997 Movie Review
  • 1997 Movie Review in Telugu
  • 1997 Movie Telugu Review
  • 1997 Periodic Movie

తాజావార్తలు

  • Peddi: స్పెషల్ “హీరోయిన్” కోసం ఫలించని ప్రయత్నాలు.. మరింత ఆలస్యం!

  • SRH Powerplay Record: పవర్ ప్లేలో మరో రికార్డ్.. పంజాబ్ బౌలర్లను చితకొట్టిన SRH బ్యాటర్స్..!

  • Ranveer singh: ధురంధర్ సక్సెస్.. ఆర్ఎస్ఎస్ చీఫ్‌ను కలిసిన రణవీర్ సింగ్..

  • Headache in Sunlight: ఎండలోకి వెళ్తే మీకు తలనొప్పి వస్తుందా.? అయితే.. మీకు ఈ సమస్య ఉన్నట్లే.!

  • Extramarital Affair: ట్యాక్సీ డ్రైవర్‌తో బ్యాంక్ మేనేజర్ భార్య ఎఫైర్.. భర్తను చంపేందుకు ప్లాన్! క్లైమాక్స్‌లో షాకింగ్ ట్విస్ట్..

ట్రెండింగ్‌

  • సరికొత్త కలర్స్, అబ్బురపరిచే డిజైన్, 200MP కెమెరాతో మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్దమైన Huawei Pura 90 సిరీస్..!

  • Pillow Cover Stains : నూనె మరకలతో దిండ్లు చెడిపోయాయా.? ఇలా చేస్తే కొత్తలాగే మెరుస్తాయి.!

  • Ragi Bread : ఈస్ట్ అక్కర్లేదు.. గ్లూటెన్ భయం లేదు.. ఆరోగ్యకరమైన ‘రాగి బ్రెడ్’ ఇప్పుడు ఇంట్లోనే.!

  • రికార్డు సృష్టించిన MG Majestor.. రైలును లాగి గిన్నిస్ బుక్‌లో స్థానం!

  • Car Prices Hike: కారు కొనాలనుకుంటే కోనేయండమ్మా.. మే 1 నుండి మరింత కాస్ట్లీ కాబోతున్నాయి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions