Site icon NTV Telugu

Green Tax: వాహనదారులకు గుడ్ న్యూస్.. ఇక పై మీరు ఆ ట్యాక్స్ చెల్లించాల్సిన పనిలేదు

New Project (9)

New Project (9)

Green Tax: ఉత్తర ప్రదేశ్ లోని పాత కార్లు, ద్విచక్ర వాహనాల యజమానులకు శుభవార్త. ఉత్తరప్రదేశ్‌లో పాత కార్లు, బైక్‌ల రీ-రిజిస్ట్రేషన్‌పై గ్రీన్ ట్యాక్స్ వర్తించదు. ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం పాత వాహనాల రీ-రిజిస్ట్రేషన్‌పై గ్రీన్ ట్యాక్స్ విధించే ప్రతిపాదనను తిరస్కరించింది. అంటే వాహనాలు 15 ఏళ్ల వ్యవధిని పూర్తి చేసుకోనున్న వాహన యజమానులకు ఇది శుభవార్త. పాత వాహనాల రీ-రిజిస్ట్రేషన్‌పై 2 శాతం గ్రీన్ ట్యాక్స్ వసూలు చేయాలని రవాణా శాఖ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారు. దీన్ని ఇప్పుడు ప్రభుత్వం తిరస్కరించింది.

రవాణాశాఖ పంపిన ప్రతిపాదన ఆమోదం పొందితే బైక్‌ డ్రైవర్లకు రూ.600, కార్ల యజమానులకు రూ.2వేలు పెరిగినట్లు ప్రభుత్వ శాఖ నుంచి అందిన సమాచారం. ఇప్పుడు మునుపటిలా పాత వాహనాల రీ-రిజిస్ట్రేషన్ సాధారణ నిర్ణీత మొత్తంలో సులభంగా చేయబడుతుంది. అలాంటి వాహనాల యజమానులు పెద్దగా జేబును ఖాళీ చేసుకోవాల్సిన పనిలేదు.

Read Also:Bhumana Karunakar Reddy: ఎంతో పుణ్యం చేసుకుంటే గానీ టీటీడీ చైర్మన్ పదవి రాదు

గ్రీన్ టాక్స్ అంటే ఏమిటి?
గ్రీన్ టాక్స్ ను కాలుష్య పన్ను లేదా పర్యావరణ పన్ను అని కూడా పిలుస్తారు. కాలుష్యానికి కారణమయ్యే వస్తువులపై పన్ను విధించడం ద్వారా ప్రభుత్వాలు వసూలు చేసే ఎక్సైజ్ సుంకం.

పన్ను ఎంత?
ఇప్పటికే 8 సంవత్సరాల కంటే పాత వాణిజ్య వాహనాలకు గ్రీన్ టాక్స్ వర్తిస్తుంది. కానీ తరువాత ఇది 15 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న ప్రైవేట్ వాహనాలకు కూడా విస్తరించబడింది.

Read Also:MLA Raja Singh: వచ్చే అసెంబ్లీలో నేను ఉండకపోవచ్చు..

Exit mobile version