Site icon NTV Telugu

WPI inflation: రికార్డు సృష్టించిన ద్రవ్యోల్బణం..

Wpi Inflation

Wpi Inflation

మంగళవారం విడుదల చేసిన ప్రభుత్వ గణాంకాల ప్రకారం టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం కొత్త రికార్డులు సృష్టించింది.. ఏప్రిల్‌లో 15.08 శాతంగా ఉన్న టోకు ధరల సూచీ… మే నెలలో రికార్డు స్థాయిలో 15.88 శాతానికి ఎగబాకింది. ఇంధన, ఆహార ఉత్పత్తుల ధరలు పెరగడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు ఆర్థిక నిపుణులు..

Read Also: Honour killing: పరువు పోయిందని.. నవదంపతుల దారుణ హత్య..

ఇక, ఆహార వస్తువులు మరియు ముడి చమురు ధరలు పెరగడం వలన మే నెలలో డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం కొత్త గరిష్ట స్థాయికి చేరుకుందని అంచనా వేస్తున్నారు.. రెండంకెల ద్రవ్యోల్బణం సాధించడం వరుసగా 14వ నెల.. గత ఏడాది ఇదే నెలలో డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం 13.11 శాతంగా ఉంది… డబ్ల్యూపీఐ ఆధారిత ద్రవ్యోల్బణం 15.88 శాతం ప్రస్తుత (2011-12) సిరీస్‌లో అత్యధికంగా ముద్రించబడింది. పాత సిరీస్‌లను కూడా పరిగణనలోకి తీసుకుంటే, చివరిసారిగా డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం ఆగస్టు 1991లో దీని కంటే ఎక్కువగా ఉంది.. అప్పుడు ఇది 16.06 శాతంగా నమోదైంది.. మే 2022లో అధిక ద్రవ్యోల్బణం రేటు ప్రధానంగా మినరల్ ఆయిల్స్, క్రూడ్ పెట్రోలియం, నేచురల్ గ్యాస్, ఫుడ్ ఆర్టికల్స్, లోహాలు, నాన్-ఫుడ్ ఆర్టికల్స్, కెమికల్స్, కెమికల్ ప్రొడక్ట్స్, ఫుడ్ ప్రొడక్ట్స్ మొదలైన వాటి ధరల పెరుగుదల కారణంగా ఉంది. మరవైపు, మే నెలలో రిటైల్‌ (సీపీఐ) ద్రవ్యోల్బణం 7.04 శాతానికి దిగొచ్చింది. ఏప్రిల్‌లో ఇది 7.79 శాతంగా నమోదైంది.. ఆగ ఏడాది అంటే 2021 మేలో ఇది 6.3 శాతంగా ఉంది. వరుసగా 5వ నెలా రిటైల్‌ ద్రవ్యోల్బణం.. ఆర్బీఐ నిర్దేశిత స్థాయి 2-6 శాతం కంటే అధికంగానే నమోదు కావడం విశేషంగా చెప్పుకోవాలి..

Exit mobile version