Text Message: ఇప్పుడు అంతా స్మార్ట్‌ఫోన్ యుగం నడుస్తోంది. మొబైల్ లేనిదే ఎలాంటి పని జరగడం లేదు. అందరూ ఆన్‌లైన్‌లోనే చాటింగ్ చేసుకుంటూ పనులు చక్కబెట్టేస్తున్నారు. ఇంటర్నెట్ విస్తరణతో వాట్సాప్ మెసేజ్‌లు, మెసేంజర్ నుంచి మెసేజ్‌లు పంపుతున్నాం. అయితే పూర్వం ఇంటర్నెట్ లేకుండానే మెసేజ్‌లను మాములుగా పంపేవాళ్లం. ఈ మెసేజ్ ప్రారంభమై 30 ఏళ్లు గడిచిపోయాయి. యూకేలోని బెర్క్‌షైర్‌కు చెందిన ఇంజినీర్నీల్పాప్వర్త్ 1992 డిసెంబర్ 3న తొలిసారిగా ఓ ఎస్ఎంఎస్ చేశాడు. వొడాఫోన్ నెట్‌వర్క్ ద్వారా కంప్యూటర్ నుంచి ఆ ఇంజినీర్ పంపిన తొలి ఎస్ఎంఎస్ ‘మెర్రీ క్రిస్మస్’. ఆ మెస్సేజ్ అందుకున్న వ్యక్తి ఆ సమయంలో వోడాఫోన్‌కు డైరెక్టర్‌గా ఉన్న రిచర్డ్ జార్విస్ .
మరుసటి ఏడాది 1993లో నోకియా ఎస్ఎంఎస్‌లు పంపించే మొబైళ్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఆ తర్వాత 1999లో ఇతర నెట్‌వర్క్ యూజర్లకు కూడా సందేశాలు పంపడం సాధ్యమైంది .దీన్ని అనుసరిస్తూ జపాన్ వారు ఎమోజీలను క్రియేట్ చేయడం అప్పట్లో సంచలనమైంది. తర్వాతి రోజుల్లో ఇంటర్నెట్ వాడకం క్రమంగా పెరిగిపోవడం, ఆపై స్మార్ట్‌ఫోన్లు రావడంతో నెట్ వాడి ఎస్సెమ్మెస్‌లు పంపడం, ప్రస్తుతం ఫేస్‌బుక్, వాట్సప్‌లలో తమ మిత్రులకు సందేశాల ద్వారా విషయాలను షేర్ చేసుకుంటున్నారు.
Read Also: South Central Railway: హైదరాబాద్-విజయవాడ మధ్య ‘వందేభారత్’.. ఈనెలలోనే ప్రారంభం
అయితే టెస్ట్ మెసేజ్అనేది ఇంత ఫేమస్ అవుతుందని 1992లో తనకు తెలియదని నీల్‌పాప్ వర్త్ అన్నారు. ఇప్పుడు మిలియన్ల మంది వాడుతున్న యాప్స్‌లో ఎమోజీలు కూడా వచ్చేశాయని.. ప్రపంచంలోనే తొలి మెసేజ్తానే పంపించానని ఇటీవలే తన పిల్లలకు చెప్పానని.. తాను పంపించిన ఆ మెసేజ్ మొబైల్ ఫోన్ చరిత్రలోనే అత్యంత కీలకంగా మారిందని ఇప్పుడు అనిపిస్తోందని నీల్ అభిప్రాయపడ్డాడు. కాగా మెసేజింగ్ఐడియా అనేది 1980లల్లో పుట్టుకొచ్చింది. కానీ అది కార్యరూపం దాల్చడానికి దాదాపు పదేళ్లు పట్టింది. తొలినాళ్లల్లో మెసేజ్ ద్వారా కేవలం 160 క్యారెక్టర్లను పంపాల్సి ఉండేది. కానీ సోషల్ మీడియా యాప్స్ రాకతో మెసేజ్‌కు ప్రాధాన్యత తగ్గిపోయింది. కానీ అప్పట్లో ప్రతి ఏడాది బిలియన్ల కొద్ది మెసేజ్‌లు ఫార్వాడ్ అవుతూ ఉండేవి.