NTV Telugu Site icon

Wind Man of India: ‘విండ్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా’ తుల్సి తంతి ఇకలేరు

Wind Man Of India

Wind Man Of India

Wind Man of India: సుజ్లాన్ ఎనర్జీ అనే సంస్థకు ఫౌండర్‌గానే కాకుండా ‘విండ్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా’గా కూడా పేరొందిన తుల్సి తంతి కన్నుమూశారు. మన దేశంలోని పవన విద్యుత్‌ వ్యాపార దిగ్గజాల్లో ఈయన కూడా ఒకరు కావటం చెప్పుకోదగ్గ విషయం. తుల్సి తంతి క్లీన్‌ ఎనర్జీ సెక్టార్‌లో సైతం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందటం విశేషం. సుజ్లాన్‌ ఎనర్జీ కంపెనీ ప్రస్తుత మార్కెట్‌ విలువ 8 వేల 5 వందల 35 కోట్ల రూపాయలకు పైగా నమోదు అయింది. విండ్‌ పవర్‌ ఫీల్డ్‌లోకి రాకముందు తుల్సి తంతి టెక్స్‌టైల్‌ బిజినెస్‌ చేసేవారు.

టెస్లా కార్ల కంపెనీ డెలివరీలో రికార్డు

టెస్లా కార్ల కంపెనీ డెలివరీ చరిత్రలో కొత్త రికార్డు నమోదైంది. ఈ ఆర్థిక సంవత్సరంలోని మూడో త్రైమాసికంలో 3 లక్షల 65 వేలకు పైగా వాహనాలను ఉత్పత్తి చేసిన టెస్లా.. అందులో 3 లక్షల 43 వేలకు పైగా వాహనాలను డెలివరీ చేసింది. తొలి త్రైమాసికంలో 3 లక్షల 10 వేల వాహనాలను మాత్రమే డెలివరీ చేసిన టెస్లా రెండో త్రైమాసికంలో మరీ తక్కువగా రెండున్నర లక్షల వాహనాలకే పరిమితమైంది. అయితే మూడో త్రైమాసికంలో 3 లక్షల 60 వేల వాహనాలను డెలివరీ చేస్తుందనే అంచనాలకు మాత్రం కొద్ది దూరంలో ఉండిపోయింది.

read also: New Traffic Rules: నేటి నుంచి కొత్త ట్రాఫిక్‌ రూల్స్‌.. ఇవి పాటించకపోతే బాదుడే బాదుడు..

ఐటీని లీడ్‌ చేయనున్న ఇన్ఫోసిస్‌

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని రెండో త్రైమాసికంలో ఐటీ రంగం పనితీరు విషయంలో దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్‌ ఇతర సంస్థల కన్నా ముందు వరుసలో నిలవనుందనే అంచనాలు నెలకొన్నాయి. త్రైమాసిక ఫలితాల్లో నాలుగు శాతం రెవ్యెన్యూ గ్రోత్‌ను నమోదుచేస్తుందని జఫరీస్‌ అనే రీసెర్చ్‌ సంస్థ తన నివేదికలో పేర్కొంది. ఇండియన్‌ ఐటీ సెక్టార్‌ మొత్తం రెవెన్యూ గ్రోత్‌ని 3.6 శాతంగానే అంచనా వేసిన జెఫరీస్‌.. ఇన్ఫోసిస్‌ ఫలితాలను మాత్రం అంతకన్నా ఎక్కువగా అంటే 4 శాతంగా ఎస్టిమేట్‌ వేసింది.

స్టాక్ మార్కెట్ అప్‌డేట్‌

స్టాక్‌ మార్కెట్లు ఈ నెల, ఈ వారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 350 పాయింట్లు కోల్పోయి 57076 వద్ద ట్రేడింగ్‌ అవుతోంది. నిఫ్టీ 107 పాయింట్ల తగ్గి 16986 పైన కొనసాగుతోంది. ఆయిల్‌ ఇండియా, ఓఎన్‌జీసీ షేర్లు 6 శాతం దాక లాభపడ్డాయి. అపోలో ట్యూబ్స్‌, ఐషర్‌, కోలిండియా, ఇండియాబుల్స్‌ స్టాక్స్‌ ఆశాజనకంగా ఉన్నాయి. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ 81.64 వద్ద కొనసాగుతోంది.