యూజర్లకు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను తీసుకురావడంలో వాట్సాప్ ముందుంటుంది. అందుకే ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని మెసెంజర్ యాప్‌లు ఉన్నా యూజర్లు వాట్సాప్ వాడటాన్ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇప్పటికే పేమెంట్స్ వంటి ఫీచర్లను కూడా వాట్సాప్ ప్రవేశపెట్టింది. తాజాగా మహిళల కోసం వాట్సాప్ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. మహిళలు తమ నెలసరిని సులువుగా ట్రాక్ చేసేందుకు వీలుగా సిరోనా హైజెనీ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థతో కలిసి వాట్సాప్ ఈ ఫీచర్‌ను ప్రారంభించింది. దేశంలో తొలిసారిగా వాట్సాప్ ద్వారా ఈ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు సిరోనా హైజెనీ సంస్థ తెలియజేసింది. మహిళల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సేవలు అందుబాటులోకి తెస్తున్నట్లు వివరించింది.
ఈ సేవల కోసం మహిళా యూజర్లు +919718866644 నంబర్‌కు హాయ్ అని మెసేజ్ పంపాలి. తర్వాత చాట్‌బోట్ చూపించే మూడు ఆప్షన్‌లలో ఒకదాన్ని ఎంచుకుని కొంత ప్రాథమిక సమాచారం ఎంటర్ చేయాలి. దీంతో యూజర్ సమాచారాన్ని చాట్‌బోట్ రికార్డు చేసి కచ్చితమైన నెలసరి తేదీని యూజర్‌కు రిమైండర్ ద్వారా తెలియజేస్తుంది. వాట్సాప్ ద్వారా నెలసరి ట్రాకింగ్‌తో పాటు గర్భధారణ, గర్భధారణ నివారణ సేవలను కూడా సిరోనా హైజెనీ సంస్థ అందిస్తోంది.
Prepaid Offer: రిలయన్స్ జియో నుంచి మరో బెస్ట్ ప్రీ పెయిడ్ ప్లాన్