WhatsApp: వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. ఇక క్షణాల్లో..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘వాట్సాప్’ దాదాపు ఈ సోషల్ మీడియా యాప్ తెలియనివారు ఉండరు అంటే ఆశ్చర్య పోవాల్సిన అవసరమే లేదు.. అంతలా అందరి జీవితాల్లో ఇది భాగమైపోయింది.. చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉందంటే.. దాంట్లో వాట్సాప్ ఉండాల్సిందే.. టెస్ట్, వీడియోలు, ఫైల్స్, లింక్‌లు, ఫొటోలు.. వాయిస్ కాల్స్, వీడియో కాల్స్.. ఇలా అనేక ఫీచర్లు అందుబాటులో ఉండడంతో.. తక్కువ కాలంలోనే అందరి అభిమానాన్ని చురగొంది. ఇక, వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా.. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్‌ను పరిచయం చేస్తూనే ఉన్నారు నిర్వహకులు.. వినియోగదారు అనుభవాన్ని మెరుగుపరచడానికి వివిధ మార్గాలను పరీక్షిస్తోంది.. మెసేజింగ్ యాప్ చాట్ ఫిల్టర్లలో పని చేస్తున్నట్లు కనుగొంది.. ఇది వినియోగదారులను సులభంగా మరియు వేగంగా చాట్లను కనుగొనేలా చేయనుండడంతో.. చాట్ ఫిల్టర్ అనే ఫీచర్ తీసుకొస్తుంది.
అయితే, చాట్ ఫిల్టర్ ఫీచర్ ఇప్పటికే వాట్సాప్ బిజినెస్ అకౌంట్లలో అందుబాటులో ఉండగా.. ఇప్పుడు వ్యాపారేతర ఖాతాలకు కూడా పరిచయం చేసేందుకు సిద్ధమైంది వాట్సాప్.. ఈ మధ్యే వాట్సాప్ 2 జీబీ వరకు ఫైల్‌లను బదిలీ చేసే సామర్థ్యం, ఎమోజి ప్రతిచర్యలతో పాటు మరికొన్ని ఆసక్తికరమైన మార్పులు తీసుకొస్తూనే ఉంది.. తాజాగా సమాచారం ప్రకారం.. వాట్సాప్ ఆన్ రైడ్, ఐఎస్వో మరియు డెస్క్‌టాప్ కోసం వ్యాపార ఖాతాల కోసం అధునాతన చాట్ ఫిల్టర్‌ను రూపొందించింది. చాట్లను త్వరగా వెతకడానికి ఇది ఎంతో ఉపయోగపడనుంది.. త్వరలోనే వినియోగదారులందరికీ ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు సాగుతున్నాయని నివేదికలు చెబుతున్నాయి.
Also Read
- ఆపదలో దేవుడిలా మారిన Apple Watch.. కూతురు ఇచ్చిన గిఫ్ట్.. తండ్రికి ప్రాణం పోసింది!
- WhatsApp Webలో ఆడియో, వీడియో కాలింగ్ సపోర్ట్.. Call Transfer, Waiting Room సహా కొత్త ఫీచర్స్ కూడా.!
- 7,200mAh బ్యాటరీ, Dimensity 7400 Turbo చిప్‌తో vivo T5x 5G కొత్త Fusion Red కలర్ వేరియంట్ లాంచ్..!
- HMD Asha 305: HMD Asha 305 విడుదల.. 2GB RAM, 16GB స్టోరేజ్, 4Gతో చౌకైన స్మార్ట్‌ఫోన్
వాట్సాప్‌లో చదవని చాట్లు, కాంటాక్ట్‌లు, నాన్-కాంటాక్ట్‌లు మరియు సమూహాల కోసం శోధించడాన్ని సులభతరం చేయనుంది చాట్ ఫిల్టర్.. ప్రైమరీ WhatsApp అకౌంట్లలో కూడా యాప్ ఫీచర్ అప్ డేట్ తీసుకురాబోతోంది. ఈ ఫిల్టర్ బటన్ మీరు చాట్లను మెసేజ్‌ల కోసం సెర్చ్ చేసినప్పుడు కూడా కనిపిస్తుందని నివేదిక పేర్కొంది. చాట్ ఫిల్టర్ ఫీచర్.. డెస్క్‌టాప్‌లో WhatsApp బీటాలో కనిపించింది. ఫ్యూచర్ అప్డేట్లో.. ఆండ్రాయిడ్ iOSలోని బీటా టెస్టర్ల కోసం WhatsApp ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక, రెండు వారాల క్రితమే వాట్సాప్ బీటా UWP 2.2216.4.0 వెర్షన్‌ను ఇన్స్టాల్ చేసిన యూజర్లకు అందుబాటులో ఉందని నివేదికలు చెబుతున్నాయి.
తాజావార్తలు
-
NBK111: సర్జరీ అయినా తగ్గేదేలే.. బాలయ్య మొండితనానికి ఫ్యాన్స్ ఫిదా! అక్టోబర్ 1 నుంచి NBK111 షూటింగ్?
-
Telangana Education: రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి 9 శాతం ఖర్చు చేస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి
-
Karnataka: కన్న కూతురుపై తండ్రి పగ.. కాలేజీకెళ్లి కత్తి దాడి.. దేనికోసమో తెలిస్తే..!
-
Sai Krishna లాకప్ డెత్ కేసులో కొత్త ట్విస్ట్.. హైకోర్టులో ఊహించని పరిణామం.!
-
ఆపదలో దేవుడిలా మారిన Apple Watch.. కూతురు ఇచ్చిన గిఫ్ట్.. తండ్రికి ప్రాణం పోసింది!
ట్రెండింగ్
-
WhatsApp Webలో ఆడియో, వీడియో కాలింగ్ సపోర్ట్.. Call Transfer, Waiting Room సహా కొత్త ఫీచర్స్ కూడా.!
-
7,200mAh బ్యాటరీ, Dimensity 7400 Turbo చిప్‌తో vivo T5x 5G కొత్త Fusion Red కలర్ వేరియంట్ లాంచ్..!
-
Ajinkya Rahane: అజింక్య అంటే ఓడిపోనివాడు.. కానీ క్రికెట్ ఎన్నో ఓటములను చూపించింది!
-
Ajinkya Rahane Retirement: అజింక్య రహానే రిటైర్మెంట్.. ఇకపై క్రికెట్ ఆడనంటూ భావోద్వేగ పోస్ట్!
-
Vaibhav Sooryavanshi: నేను ఏ బౌలర్‌కు భయపడను.. వారే నన్ను చూసి వణికిపోతున్నారు!