Vijaypat Singhania: 12 వేల కోట్ల ఆస్తి నుంచి అద్దె ఇంటి వరకు.. ఓ సంపన్నుడి కన్నీటి కథ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijaypat Singhania: భారత పారిశ్రామిక రంగంలో ఒక శకాన్ని లిఖించిన రేమండ్ గ్రూప్ మాజీ ఛైర్మన్ విజయపత్ సింఘానియా (87) కన్నుమూశారు. శనివారం సాయంత్రం ముంబైలో ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు, రేమండ్ ప్రస్తుత ఛైర్మన్ గౌతమ్ సింఘానియా సోషల్ మీడియా వేదికగా ధృవీకరించారు. రూ.12 వేల కోట్ల ఆస్తి నుంచి అద్దె ఇంటి వరకు ఓ సంపన్నుడి కన్నీటి కథ ఎలా సాగిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: CM Nitish Kumar: సీఎం నితీష్ కుమార్ రేపు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా..
Also Read
- RBI Polymer Notes: ప్లాస్టిక్ కరెన్సీకి శ్రీకారం.. గ్లోబల్ టెండర్ జారీ చేసిన ఆర్బీఐ.. కఠిన షరతులు..!
- RBI Polymer Notes: దేశంలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు?.. రూ.10, రూ.20 నోట్లపై ఆర్బీఐ భారీ సన్నాహాలు
- EPFO గుడ్ న్యూస్.. PF ఖాతాల్లో వడ్డీ జమ.. మీ ఖాతాలో పడిందా? వెంటనే చెక్ చేసుకోండి
- EPFO: ‘విశ్వాస్’ పథకాన్ని ప్రారంభించిన ఈపీఎఫ్‌వో.. ఎవరి కోసమంటే..!
రేమండ్‌ను ప్రపంచస్థాయి బ్రాండ్‌గా నిలబెట్టిన విజయపత్ సింఘానియా జీవితంలోని 5 ముఖ్యమైన ఘట్టాలు ఇవే..
1. రేమండ్ సామ్రాజ్య నిర్మాత (1980 – 2015)
1938లో జన్మించిన విజయపత్ సింఘానియా, 1980లో రేమండ్ గ్రూప్ పగ్గాలను చేపట్టారు. ఆయన నాయకత్వంలో ఈ సంస్థ కేవలం వస్త్ర వ్యాపారానికే పరిమితం కాకుండా, సుగంధ ద్రవ్యాలు, ఇతర రంగాల్లోకి కంపెనీ విస్తరించింది. 90వ దశకంలోనే రేమండ్ బ్రాండ్‌ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఘనత ఆయనదే.
2. ఆకాశమే హద్దుగా రికార్డులు..
విజయపత్ కేవలం వ్యాపారవేత్త మాత్రమే కాదు, ఆయనో గొప్ప విమానయాన ప్రియుడు కూడా. శిక్షణ పొందిన పైలట్‌గా ఆయన అనేక రికార్డులు సృష్టించారు. 2005లో హాట్ ఎయిర్ బెలూన్‌లో ఏకంగా 21,000 మీటర్ల ఎత్తుకు ఎగిరి ప్రపంచ రికార్డు నెలకొల్పారు. ముంబై షెరీఫ్‌గా కూడా ఆయన బాధ్యతలు నిర్వహించారు.
3. పద్మభూషణ్ పురస్కారం
వ్యాపార, విమానయాన రంగాల్లో ఆయన చేసిన విశేష కృషికి గాను భారత ప్రభుత్వం 2006లో ఆయనను పద్మభూషణ్‌తో సత్కరించింది. 1994లో భారత వైమానిక దళం ఆయనకు ‘గౌరవ ఎయిర్ కమోడోర్’ బిరుదును ప్రదానం చేసింది.
4. రాజభవనం నుంచి అద్దె ఇంటికి..
విజయపత్ జీవితం ఎందరికో ఆశ్చర్యం కలిగిస్తుంది. ఒకప్పుడు రూ.12,000 కోట్ల నికర ఆస్తితో, దేశంలోని అత్యంత ఖరీదైన ఇళ్లలో ఒకటిగా పేరొందిన ‘జేకే హౌస్’లో విలాసవంతమైన జీవితాన్ని గడిపారు. కానీ 2015 తర్వాత పరిస్థితులు మారిపోయి, దక్షిణ ముంబైలోని ఒక అద్దె ఇంట్లో నివసించవలసి రావడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
5. కుమారుడితో ఆస్తి వివాదం.. జీవితంలో చేసిన పెద్ద తప్పు!
2015లో రేమండ్ గ్రూప్ బాధ్యతలను కుమారుడు గౌతమ్ సింఘానియాకు అప్పగించిన తర్వాత, తండ్రీకొడుకుల మధ్య తీవ్రమైన ఆస్తి వివాదాలు తలెత్తాయి. “నా ఆస్తి అంతా కొడుకుకు అప్పగించడమే నా జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు” అని విజయపత్ స్వయంగా ఒక ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేశారు. తనను కొడుకు రోడ్డుపైకి తెచ్చాడని ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సంచలనం సృష్టించాయి.
READ ALSO: Pakistan: పాకిస్థాన్ ఎయిర్‌లైన్స్‌కు గడ్డుకాలం.. ఏ క్షణమైనా మూతపడే ఛాన్స్! ఎందుకో తెలుసుకోండి..
తాజావార్తలు
-
Pawan Kumar Chandana: మ్యాథ్స్‌లో 51 మార్కులు.. నేడు భారత తొలి ప్రైవేట్ రాకెట్ విజయవంతం.. హైదరాబాద్ కుర్రాడి విజయగాథ!
-
Jani Master: నిర్మాతల డబ్బులు దోచేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా?
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్‌పైనే అందరి చూపు!
-
Childhood Trauma: కళ్ల ముందే తల్లి హత్య.. ఈ చిన్నారుల ఆవేదన చూస్తే కన్నీళ్లు ఆగవు!
-
Ather Battery Update: ఏథర్ స్కూటర్లకు కొత్త బ్యాటరీ అప్డేట్.. ఇప్పుడు ఎక్కువ రేంజ్, వేగవంతమైన ఛార్జింగ్!
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్‌కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్‌తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!