Site icon NTV Telugu

Union Bank: బంపర్ ఆఫర్ ప్రకటించిన యూనియన్ బ్యాంక్.. నవంబర్ 15 వరకే ఈ ఆఫర్

Union Bank

Union Bank

వినాయక చవితితో పండుగల సీజన్ స్టార్ట్ అయింది. ఈ ఫెస్టివల్ టైంలో టీవీ-ఫ్రీజ్-వాషింగ్ మెషిన్ వరకు వివిధ వస్తువులపై భారీ డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. ఈ సందర్భంగా, బ్యాంకులు తగ్గింపు వడ్డీ రేట్లతో, జీరో ప్రాసెసింగ్ ఫీజుల ఆఫర్‌లను కూడా అమలు పరుస్తాయి. ప్రస్తుతం ప్రభుత్వ రంగ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఇలాంటి ఆఫర్‌ అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే, ఈ ఆఫర్ క్రెడిట్ స్కోర్ 700 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న అకౌంట్ హోల్డర్స్ కు మాత్రమే అందుబాటులో ఉంది.

Read Also: Pak Miss Universe: వివాదాల్లో మిస్ యూనివర్స్ పాకిస్తాన్ ఎరికా రాబిన్.. ప్రభుత్వం విచారణకు ఆదేశం

యూనియన్ బ్యాంక్ స్వాతంత్ర దినోత్సవం నుంచి ఈ ఆఫర్‌ను అమలు చేయనున్నట్లు తెలిపింది. ఈ బంఫర్ ఆఫర్ కింద, హోమ్ లోన్, ఫోర్ అండ్ టూ వీలర్ లోన్‌లపై ప్రాసెసింగ్ ఫీజులో 100 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. కానీ, ఈ ఆఫర్ ప్రయోజనం కేవలం క్రెడిట్ స్కోర్ 700 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న ఖాతాదారులకు మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉంది. మీరు 15 నవంబర్ 2023 వరకు దాని ప్రయోజనాన్ని పొందొచ్చు. ఒక వ్యక్తి ఏదైనా ఇతర బ్యాంక్ లేదా NBFC నుంచి హౌసింగ్ లోన్ బదిలీ చేస్తే, అతను ఈ ఆఫర్, ప్రయోజనాన్ని కూడా పొందే అవకాశం ఉంది.

Read Also: ODI WC 2023: ఆసియా కప్ ఎఫెక్ట్.. పాకిస్తాన్ జట్టులో కీలక ఆటగాళ్లకు విశ్రాంతి..!

ఒక వ్యక్తి క్రెడిట్ స్కోర్ వారి లోన్ తీసుకునేందుకు కీ రోల్ పోషిస్తుంది. రుణం ఇవ్వాలా వద్దా అని నిర్ణయించడానికి బ్యాంక్ లేదా NBFC రుణగ్రహీత క్రెడిట్ స్కోర్‌ను చెక్ చేస్తారు. క్రెడిట్ స్కోర్ రుణ వడ్డీ రేటుతో పాటు ఆమోదించిన లోన్ మొత్తాన్ని ప్రభావితం చేస్తుంది. మీ క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉంటే.. మీ లోన్ దరఖాస్తును కూడా తిరస్కరించే ఛాన్స్ ఉంది. క్రెడిట్ స్కోర్ 300 నుంచి 900 వరకు ఉంటుంది.. 750 నుంచి 900 వరకు ఉన్న క్రెడిట్ స్కోర్ అద్భుతమైనదిగా బ్యాంకులు పరిగణిస్తాయి. NBFCలు, బ్యాంకులు, ఇతర ఆన్‌లైన్ లోన్ యాప్స్ ఈ పరిధిలో క్రెడిట్ స్కోర్‌లతో రుణగ్రహీతలను ఇష్టపడతారు. అయితే, మీ క్రెడిట్ స్కోర్ 600 కంటే తక్కువగా ఉంటే.. మీకు లోన్ దొరకడం కాస్త కష్టంగా మారుతుంది.

Read Also: Minister Harish Rao: కాంగ్రెస్ మాయమాటలు నమ్మి ఆగం కావొద్దు.. త్వరలోనే బీఆర్ఎస్ మేనిఫెస్టో

మీరు క్రెడిట్ కార్డ్ బిల్లులు, లోన్ ఈఎంఐలను సకాలంలో తిరిగి చెల్లిస్తే, మీరు మంచి క్రెడిట్ స్కోర్‌ను పొందే అవకాశం ఉంది. దీని వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి.. మీకు అన్ని రకాల రుణాలపై తక్కువ వడ్డీ రేట్లు అందిస్తారు. ఏదైనా బ్యాంకు మీకు క్రెడిట్ కార్డ్‌ని జారీ చేయడానికి రెడీగా ఉంటుంది. మీరు దానిపై ఈజీగా లోన్ కూడా తీసుకొవచ్చు. ఇది మాత్రమే కాకుండా, మీకు అధిక క్రెడిట్‌ను కూడా పొందే అవకాశం ఉంటుంది.

Exit mobile version