NTV Telugu Site icon

Union Bank Recruitment : డిగ్రీ అర్హతతో రూ. 85 వేల శాలరీ.. ఎలా అప్లై చేయాలంటే..

Union Bank

Union Bank

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జాబ్‌ రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. 1500 లోకల్‌ బ్యాంక్‌ ఆఫీసర్‌ పోస్టులను భర్తీకి చేయనుంది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న వివిధ శాఖల్లో 2024-25 ఆర్థిక సంవత్సరానికి మొత్తం 1500 ఖాళీలను భర్తీ చేయాలని యూబీఐ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి 200, తెలంగాణలో 200 పోస్టులు కేటాయించింది. యూనియన్ బ్యాంక్ లో ఎల్‌బీఓ రిక్రూట్‌మెంట్ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 24వ తేదీ నుంచే ప్రారంభమైంది. కాగా.. నవంబర్‌ 13 వరకు దరఖాస్తులకు అవకాశం కల్పించింది.

READ MORE: Mahesh Babu: శ్రీకృష్ణుడిగా మహేష్ బాబు.. ఇక థియేటర్లకు సెక్యూరిటీ రెడీ చేసుకోండమ్మా!!

విద్యార్హత..
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ డిగ్రీ కలిగిన వారు ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. 20 నుంచి 30 సంవత్సరాలు వయస్సు కలిగిన వారికి మాత్రమే అవకాశం ఉంది. SC/ST లకు 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ కేటాయించారు. అదేవిధంగా ఓబీసీ కేటాగిరీకి చెందిన అభ్యర్థులకు 3, జనరల్ పీడబ్య్ల్యూడీ అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయో సడలింపు వర్తిస్తుందని బ్యాంకు తెలిపింది.

READ MORE:AP High Court: మాజీ మంత్రి బాలినేని పిటిషన్ డిస్మిస్ చేసిన హైకోర్టు..

దరఖాస్తు రుసుము..
అయితే.. జనరల్ అభ్యర్థులు రూ.850, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.175 దరఖాస్తు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. పరీక్ష ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించాల్సి ఉంటుంది. జీతం నెలకు రూ.48,480 నుంచి రూ.85,920 వరకు ఉంటుంది. అర్హులైన అభ్యర్థులకు ముందుగా రాత పరీక్ష నిర్వహిస్తారు. అందులో అర్హత సాధించిన వారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇది అభ్యర్థుల సంఖ్య ఆధారంగా నిర్వహిస్తారు. దేశ వ్యాప్తంగా అనేక నగరాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు జాయినింగ్‌ తేదీ నుంచి రెండేళ్ల పాటు ప్రొబేషన్‌ పీరియడ్‌ ఉంటుంది. దరఖాస్తు, తదితర వివరాలకు అభ్యర్థులు.. https://www.unionbankofindia.co.in/english/recruitment.aspx వెబ్ సైట్‌ని సంప్రదించండి.